టాలీవుడ్ కి చందమామగా పరిచయమై స్టార్ హీరోలందరితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుని కొన్నాళ్లపాటు టాలీవుడ్ ని ఏలిన కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కూడా నటనకు ఫుల్ స్టాప్ పెట్టకుండా సినిమాల్లో నటిస్తూనే ఉంది. ఇంకా బిజీగానే కనిపిస్తుంది. కోవిడ్ సమయంలో ప్రేమికుడు గౌతమ్ కిచ్లుతో ఏడడుగులు నడిచి ఓ బాబు కి తల్లిగా మారిన కాజల్ అగర్వాల్ ఆ తర్వాత కూడా క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తుంది. బిడ్డ పుట్టాక కాస్త బొద్దుగా మారిన కాజల్ మొదటి నుంచి ఫిట్ నెస్ విషయంలో చాలా పర్ఫెక్ట్ గా ఉండేది.
తన ఫిగర్ ని కాపాడుకుంటూ కష్టపడి వర్కౌట్స్ చేసే కాజల్ బిడ్డ పుట్టాక శరీరంలో వచ్చిన మార్పులని యాక్సెప్ట్ చేస్తూ ముందుకు సాగింది. అయితే ఇప్పుడు ఆ బొద్దు గుమ్మ కాస్తా మళ్ళీ ఎప్పటిలాగే స్లిమ్ లుక్ లోకి షిఫ్ట్ అయ్యింది. రీసెంట్ గా ఫ్యామిలీతో కలిసి టైమ్ స్పెండ్ చేస్తూ కొడుకు నీల్ తో భర్త గౌతమ్, తల్లితండ్రులతో సరదాగా గడిపిన కాజల్ సోషల్ మీడియాలో సరికొత్త ఫోటో షూట్ షేర్ చేసింది. బ్లాక్ మోడరన్ డ్రెస్సుతో స్లిమ్ గా అందంగా కనిపించింది. అది చూసిన వారు మళ్ళీ కాజల్ ని అప్పట్లో చందమామని చూస్తున్నట్టే ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.