Advertisementt

గాంజా శంకర్ పై నార్కొటిక్ బ్యూరో ఆగ్రహం

Sun 18th Feb 2024 11:14 AM
narcotics bureau  గాంజా శంకర్ పై నార్కొటిక్ బ్యూరో ఆగ్రహం
Narcotics Bureau is angry over the title of the movie Ganja Shankar గాంజా శంకర్ పై నార్కొటిక్ బ్యూరో ఆగ్రహం
Advertisement
Ads by CJ

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన గాంజా శంకర్ టైటిల్ పై నార్కొటిక్ బ్యూరో ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం ఈ టైటిల్ పైనే కాదు.. సినిమాల్లో గంజాయి తాగే సీన్స్ కానీ, లేదంటే మద్యం తాగే సీన్స్ కానీ లేకుండా చూడాలని, ఇలాంటివి సినిమాల్లో పెట్టడం వలన యువత తప్పుడు మార్గంలో ప్రయాణించేందుకు మార్గం చూపడమే అని.. ఈ విషయాల్లో ఇకపై సహించేది లేదని నార్కొటిక్ బ్యూరో స్పష్టం చేసింది. తాజాగా సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న గాంజా శంకర్ సినిమా పేరును మార్చాల్సిందేనంటూ చిత్రబృందానికి నోటీసులు పంపింది.

అంతేకాకుండా గాంజా శంకర్ మూవీ ట్రైలర్ సైతం యువతపై ప్రభావం చూపేలా ఉందని, దాన్ని కూడా మార్చాలని ఆదేశించింది. సినిమా ఆర్టిస్టులు, ఇతర సెలబ్రిటీలు సామాజిక బాధ్యతతో నడుచుకోవాలని నోటీసుల్లో పేర్కొంది. ఇకపై యువతకి హాని కలిగించే ఏ సన్నివేశాలను సినిమాల్లో ప్రోత్సహించవద్దని నార్కొటిక్ బ్యూరో(TSNAB) ఆగ్రహం వ్యక్తం చేసింది.

Narcotics Bureau is angry over the title of the movie Ganja Shankar:

Telangana State Narcotics Bureau is angry over the title of the movie Ganja Shankar

Tags:   NARCOTICS BUREAU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ