Advertisementt

సారా సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలోకి..

Wed 14th Feb 2024 12:54 PM
sara ali khan  సారా సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలోకి..
Sara Ali Khan Movie Direct Release in OTT సారా సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలోకి..
Advertisement
Ads by CJ

ఇప్పుడిప్పుడే బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతోన్న సారా అలీఖాన్ కీలక పాత్రలో నటించిన సినిమా ఏ వతన్‌ మేరే వతన్‌. ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజవుతోంది. సారా అలీఖాన్ ప్రస్తుతం ఉన్న పొజిషన్‌లో థియేట్రికల్ రిలీజ్ చాలా ముఖ్యం. థియేటర్లలో సినిమా సక్సెస్‌ని బట్టి.. స్టార్ స్టేటస్ వస్తుందనే విషయం తెలియంది కాదు. అలాంటిది.. జాన్వీ కపూర్‌కి పోటీగా బాలీవుడ్‌ని ఏలాలని చూస్తున్న సారా.. ఆమెలానే ఓటీటీలకే పరిమితమైతే.. ఇంక స్టార్ స్టేటస్ వచ్చేది ఎప్పుడు? అంటూ ఆమె అభిమానులు కొందరు సారాకు సలహాలు ఇస్తున్నారు.

ఇక ఏ వతన్‌ మేరే వతన్‌ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాను కణ్ణన్‌ అయ్యర్‌ దర్శకత్వంలో బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్మించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ వేదికగా మార్చి 21వ తేదీ నుండి ఈ సినిమా డైరెక్ట్ స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. ఈ విషయం తెలుపుతూ.. అమెజాన్ ప్రైమ్ సంస్థ కూడా ఓ వీడియోను విడుదల చేసింది. దీంతో అధికారికంగా కూడా ఈ సినిమా ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ అనే విషయంలో క్లారిటీ వచ్చేసింది. 

ఏ వతన్‌ మేరే వతన్‌ సినిమా ఉషా మెహతా జీవిత కథ ఆధారంగా తెరకెక్కినట్లుగా తెలుస్తోంది. ఉషా మెహతా స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో నిస్వార్థంగా పనిచేసిన స్వాతంత్ర్య సమరయోధురాలు. అండర్ గ్రౌండ్ రేడియో స్టేషన్‌ను ఏర్పాటు చేసి, ఉద్యమకారుల్లో ఉత్సాహాన్ని నింపిన మహిళగా ఆమెను చెప్పుకుంటారు. అందుకే ఈ సినిమాను ప్రపంచ రేడియో దినోత్సవమైన మార్చి 21న విడుదల చేస్తున్నారు.

Sara Ali Khan Movie Direct Release in OTT:

Sara Ali Khan Starring Ae Watan Mere Watan Release Details

Tags:   SARA ALI KHAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ