గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ ఛేంజర్ ని త్రీ లాంగ్వేజెస్ లో చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఫినిష్ కాకుండానే చరణ్ ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు తో RC16 మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మార్చ్ నుంచి చరణ్-బుచ్చిబాబు మూవీ సెట్స్ మీదకి వెళ్లనుంది అనే టాక్ ఉండగా.. తాజాగా రామ్ చరణ్ ఓ భారీ బాలీవుడ్ మూవీ చేయబోతున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.
బాలీవుడ్ లో గతంలో తుఫాన్ మూవీలో నటించిన చరణ్ కి హిందీ ప్రేక్షకులు షాకిచ్చారు. ఆ తర్వాత చరణ్ ఆర్.ఆర్.ఆర్ తో బాలీవుడ్ బాక్సాఫీసు మీద దాడి చేసారు. అయితే అది ఎన్టీఆర్ తో కలిసి చేసారు. తాజాగా రామ్ చరణ్ బాలీవుడ్ టాప్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీతో ప్రాజెక్ట్ చేసేందుకు మంతనాలు జరుపుతున్నారనే న్యూస్ స్ప్రెడ్ అయ్యింది. మరి చరణ్ సంజయ్ లీలతో చెయ్యబోయే చిత్రం పిరియాడికల్ డ్రామాగా ఉంటుందా.. లేదంటే రొమాంటిక్ యాంగిల్లో ఉంటుందా అనే ఆత్రుతలోకి మెగా ఫాన్స్ వెళ్లిపోతున్నారు.
అసలు రామ్ చరణ్ సంజయ్ లీలా భన్సాలీ కాంబో మూవీ ఆల్మోస్ట్ ఫిక్స్ అటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఒక వేళ అదే నిజమైతే అటు ఎన్టీఆర్-ఇటు చరణ్ ఒక్కసారే నార్త్ ప్రేక్షకులని టార్గెట్ చేసినట్టు అవుతుంది.