మాస్ రాజా రవితేజ ఈసారి ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి. క్రాక్ సినిమాతో ట్రాక్ లోకి వచ్చిన రవితేజ కి ఆ తర్వాత ధమాకా సక్సెస్ ఊరటనిచ్చింది. అయితే ఆ చిత్రం హిట్ లోని మేజర్ క్రెడిట్ శ్రీలీలే పట్టుకుపోయింది. అంతకుముందు ఆ తర్వాత వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ, టైగర్ నాగేశ్వరావు ఇవన్నీ నిరాశనే మిగిల్చాయి. మరోపక్క రవితేజ పారితోషకం విషయంలో ఎప్పటికప్పుడు హైలెట్ అవుతూనే ఉన్నాడు. తనకి సక్సెస్ లేకపోయినా అనుకున్న ఫిగర్ కి అణువంతైనా తగ్గే రకం కాదు అంటారు.
అందుకే రవితేజ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో చెయ్యాల్సిన చిత్రం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది అనే టాక్ కూడా ఉంది. ఇక ఇప్పుడు రవితేజకి హిట్ అనేది అనివార్యంగా మారింది. ఈగల్ తో రవితేజ హిట్ కొట్టాల్సిందే. రేపు శుక్రవారం విడుదల కాబోతున్న ఈ చిత్రం తెలుగు, హిందీలో విడుదలవుతుంది. ఈ చిత్రంపై రవితేజ చాలా నమ్మకం పెట్టుకున్నాడు. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈగల్ ఫిబ్రవరి 9 న విడుదలకు సిద్ధమైంది.
మరి ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. అటు ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉంది. కానీ ఈగల్ కి ట్రేడ్ లో 'లో' బజ్ కనిపిస్తుంది. ఎంతగా సినిమాని ప్రమోట్ చేస్తూ ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లినా ఈగల్ టికెట్స్ తెగడం లేదు. మరి ఈ చిత్రంతో రవితేజకి హిట్ కంపల్సరీ. ఈగల్ రిజల్ట్ తేడా కొడితే రవితేజకి కష్టమే సుమీ..!