గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న పారితోషకం పై రకరకాల ప్రచారాలు చక్కర్లు కొడుతున్నాయి. యానిమల్ హిట్ తర్వాత రష్మిక భారీగా పారితోషకం పెంచేసింది.. రెయిన్ బో, గర్ల్ ఫ్రెండ్ లాంటి హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ కోసం మూడు కోట్లు వసూలు చేస్తున్న రష్మిక.. ఇకపై చెయ్యబోయే సినిమాలకి 4 నుంచి 5 కోట్లు డిమాండ్ చేస్తుంది అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి తనపై వచ్చే రూమర్స్ కి వెంటనే రియాక్ట్ అయ్యే రష్మిక ఇప్పుడు ఈ రెమ్యునరేషన్ విషయంలోనూ అలాగే రియాక్ట్ అయ్యింది.
నేను పారితోషకం పెంచేసినట్లు ఎవరు చెప్పారు. ఈ న్యూస్ లు చూసి షాకవుతున్నాను. ఇలాంటివి చూసిన తర్వాత నేను కూడా నిజంగా ఆలోచించాలని అనుకుంటున్నాను. ఇకపై నా వద్దకు వచ్చే నిర్మాతలు ఎందుకు పారితోషకం పెంచారు అని అడిగితే, అప్పుడు నేను అక్కడ మీడియా ఇలా చెబుతోంది సార్, నేను మీడియాలో వచ్చే మాటలకు కట్టుబడి ఉండాలని అనుకుంటున్నాను అంటూ కాస్త వెటకారంగానే రష్మిక ఈ మేటర్ పై రియాక్ట్ అయ్యింది.