Advertisementt

అజిత్ వల్ల త్రిషకి ఇబ్బందా?

Mon 05th Feb 2024 01:55 PM
trisha  అజిత్ వల్ల త్రిషకి ఇబ్బందా?
Is Trisha in trouble because of Ajith movie? అజిత్ వల్ల త్రిషకి ఇబ్బందా?
Advertisement
Ads by CJ

పొన్నియన్ సెల్వన్ సక్సెస్ తర్వాత త్రిష ఒక్కసారిగా బిజీ అయ్యింది. 96 హిట్ తర్వాత త్రిషకి బోలెడన్ని ఆఫర్స్ వచ్చినా అందులో త్రిషకి హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిలిమ్స్ ఎక్కువగా వచ్చాయి. కానీ అందులో త్రిష అంతగా సక్సెస్ అవ్వలేకపోయింది. మళ్ళీ పొన్నియన్ సెల్వన్ తో త్రిష రేంజ్ మారిపోయింది. 40 ప్లస్ లోను త్రిష అందంగా, ఆకర్షణగా కనిపించడం.. పొన్నియన్ సెల్వన్ తర్వాత లియో హిట్ అవడంతో త్రిషకి స్టార్స్ ఛాన్సెస్ ఎక్కువయ్యాయి. ప్రస్తుతం అజిత్, కమల్ హాసన్ సినిమాలే కాదు.. ఇప్పుడు టాలీవుడ్ మెగాస్టార్ చిరు తో విశ్వంభరలో నటించడానికి రెడీ అయ్యింది.

అయితే త్రిష ఇప్పుడున్న బిజి షెడ్డ్యూల్స్ లో కమల్ థగ్ లైఫ్ చిత్రానికి, అలాగే అజిత్ విడముయార్చి చిత్రాలకి కి డేట్స్ కేటాయించడంతో త్రిషకి బ్బందులు మొదలయ్యాయట. ముఖ్యంగా అజిత్ విడముయార్చి కి ఎక్కువగా విదేశీ లొకేషన్స్ ఉండడం, షూటింగ్ కూడా అనుకున్న విధంగా జరగకపోవడంతో త్రిషకి కమల్ చిత్రానికి, అలాగే కొత్తగా వచ్చిన మెగాస్టార్ విశ్వంభరకి డేట్స్ సెట్ చేసుకోవడంతో ఇబ్బందులు తలెత్తాయని కోలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. మరి బిజీ షెడ్యూల్స్ ఉంటే ఇలా.. లేదంటే ఖాళీ అన్నట్టుగా హీరోయిన్స్ కి అన్నీ సమస్యలే.

Is Trisha in trouble because of Ajith movie?:

Trisha to romance Ajith Kumar in Vidamuyarchi

Tags:   TRISHA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ