మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కిన గుంటూరు కారం సంక్రాంతి ఫెస్టివల్ కి గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాక్ తో సంబంధం లేకుండా గుంటూరు కారం కలెక్షన్స్ కొల్లగొట్టినట్లుగా మేకర్స్ పోస్టర్స్ విడుదల చేసారు. మహేష్ బాబు వన్ మ్యాన్ షో లా గుంటూరు కారం ఉంది అంటూ ప్రతి వారు మాట్లాడుకున్నారు. అంతేకాకుండా మహేష్-శ్రీలీల డాన్స్ లకి యూత్ మొత్తం ఫిదా అయ్యింది. జనవరి 12 న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటిటిలోకి వస్తుందా అని ఫ్యామిలీ ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు.
అయితే గుంటూరు కారం థియేటర్స్ లో విడుదలై నెల తిరక్కుండానే ఓటిటీ డేట్ లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటిటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ గుంటూరు కారం డిజిటల్ హక్కులు దక్కించుకోగా.. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్టుగా పోస్టర్ వేసి మరీ ప్రకటించారు. ఈ లెక్కన గుంటూరు కారం నెల తిరక్కుండానే ఓటిటీ ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. థియేటర్స్ లో మిస్ అయిన వారు గుంటూరు కారం ఓటిటిలో చూసేందుకు రెడీ అవ్వండి.