Advertisementt

ప్రభాస్ కల్కి అవతారాలపై క్రేజీ న్యూస్

Fri 02nd Feb 2024 08:26 PM
kalki 2898 ad  ప్రభాస్ కల్కి అవతారాలపై క్రేజీ న్యూస్
Crazy news on Prabhas Kalki avatar ప్రభాస్ కల్కి అవతారాలపై క్రేజీ న్యూస్
Advertisement
Ads by CJ

ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి 2898AD మే 9 న విడుదలకు సిద్దమవుతుంది. రెండు భాగాలుగా విడుదల కాబోతున్న ఈ చిత్రంలో కమల్ హాసన్, అమితాబ్, దీపికా పదుకొనె లాంటి క్రేజీ స్టార్స్ నటిస్తుండగా.. రీసెంట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్, హీరో నాని, విజయ్ దేవరకొండ లాంటి స్టార్స్ కూడా కల్కి 2898AD లో గెస్ట్ రోల్స్ లో కనిపిస్తారంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. 

అదలా ఉంటే.. ఇప్పుడు ఈ చిత్రంలో ప్రభాస్ కల్కిగా పలు అవతారాల్లో కనిపిస్తాడంటున్నారు. కల్కిగా ప్రభాస్ ఫస్ట్ లుక్ ఇప్పటికే విడుదలైంది. అయితే ఈ చిత్రంలో ప్రభాస్ ఏకంగా ఐదు విభిన్న పాత్రల్లో కనిపిస్తారట. అందులో ఒకటి శ్రీమహావిష్ణువు, రెండు శ్రీరాముడు, మూడు శ్రీకృష్ణుడు, నాలుగు బుద్ధుడు, ఐదు కల్కి.. ఇలా ఐదు పాత్రల్లో ప్రభాస్ కల్కి 2898AD కనిపించనున్నట్లుగా తెలుస్తోంది. భారీ VFX తో హాలీవుడ్ సినిమాలను మించేలా ఈ చిత్రాన్నినాగ్ అశ్విన్ రెడీ చేస్తున్నాడు.

కల్కి షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. త్వరగా షూటింగ్ పూర్తి చేసి టీజర్ ని రిలీజ్ చేస్తూనే ప్రమోషన్స్ కి శ్రీకారం చుట్టి.. వరల్డ్ వైడ్ గా కల్కిని ప్రమోట్ చెయ్యాలని నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నట్లుగా  తెలుస్తోంది.

Crazy news on Prabhas Kalki avatar:

Kalki 2898 AD update

Tags:   KALKI 2898 AD
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ