Advertisementt

అనిల్ రావిపూడి నెక్స్ట్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్

Thu 01st Feb 2024 09:40 PM
venkatesh  అనిల్ రావిపూడి నెక్స్ట్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్
Interesting news on Anil Ravipudi next అనిల్ రావిపూడి నెక్స్ట్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్
Advertisement
Ads by CJ

భగవంత్ కేసరి తో హిట్ కొట్టాక అనిల్ రావిపూడి నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అందరిలో ఎంతో ఆసక్తి కనిపిస్తుంది. కామెడీ ఎంటెర్టైనెర్స్ నుంచి భగవంత్ కేసరి లాంటి సీరియస్ నెస్ సినిమాతో జోనర్ మార్చడంతో అనిల్ రావిపూడి తదుపరి సినిమాని ఏ హీరోతో మొదలు పెడతాడో, ఏ జోనర్ ని సెలెక్ట్ చేసుకుంటాడో అని అందరూ ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం అయితే సైలెంట్ గా నెక్స్ట్ సినిమా కి కథని సిద్ధం చేసుకుంటున్న అనిల్ రావిపూడి తన తదుపరి ప్రాజెక్ట్ పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది.

ఎఫ్ 2, ఎఫ్ 3 తర్వాత అనిల్ రావిపూడి మరోసారి సీనియర్ హీరో వెంకటేష్ తో సినిమా చెయ్యడానికి రెడీ అయ్యాడట. అది కూడా హిల్లేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వెంటేష్ తో సినిమా చెయ్యబోతున్నట్టుగా ఓ అప్ డేట్ సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. మరి వెంకీతో ఎఫ్ 2, ఎఫ్ 3 తో మంచి కామెడీ హిట్స్ కొట్టిన అనిల్ రావిపూడి ఇప్పుడు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కి షిఫ్ట్ అయ్యాడు. ఈ చిత్రాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించి పట్టాలెక్కించే ప్లాన్ లో అనిల్ రావిపూడి ఉన్నాడు అని సమాచారం. 

Interesting news on Anil Ravipudi next:

Venkatesh, Anil Ravipudi Combo To Be On Sets Again

Tags:   VENKATESH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ