యాంకర్ గా ఎంతో ఫేమస్ అయిన సుమ తన కొడుకుని టాలీవుడ్ కి హీరోగా పరిచయం చేసింది. రోషన్ బబుల్ గేమ్ మూవీతో తెరకి కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. బబుల్ గేమ్ ప్రమోషన్స్ తోనే రోషన్ బాగా పాపులర్ అయ్యాడు. సుమ మీదున్న అభిమానముతో రోషన్ ని చాలామంది హీరోలు ప్రమోట్ చేసారు. రోషన్ కూడా ఎంతో అనుభవం ఉన్న హీరోల సినిమాని మాటలతోనే ప్రమోట్ చేసాడు. కానీ రోషన్ కి బబుల్ గేమ్ సినిమా అనుకున్న రిజల్ట్ అందించలేకపోయింది.
ఈ చిత్రం గత ఏడాది చివరి వారంలో అంటే డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకులని అంతగా ఇంప్రెస్స్ చేయలేకపోయిన ఈ చిత్రం ఇప్పుడు ఓటిటీ రిలీజ్ డేట్ ని కన్ ఫర్మ్ చేసుకుంది. బబుల్ గేమ్ ఓటిటీ రైట్స్ ఆహా వారు ఫ్యాన్సీ రేటుతో సొంతం చేసుకోగా.. ఆ చిత్రం ఫిబ్రవరి 9 న స్ట్రీమింగ్ కి రాబోతున్నట్టుగా పోస్టర్ వదిలారు. ఫిబ్రవరి 9 న సుమ కొడుకు ఓటిటీ ఆడియన్స్ ముందుకు వచ్చేస్తుంది.