హీరో కమ్ కేరెక్టర్ ఆర్టిస్ట్ నందు ఆనంద్ కృష్ణ ప్రస్తుతం ఢీ డాన్స్ షో తో యాంకరింగ్ లోకి అడుగుపెట్టాడు. నందు ఇప్పుడు పట్టరాని ఆనందంలో మునిగిపోయాడు. కారణం నందు మరోసారి తండ్రవుతున్నాడు. సింగర్ గీత మాధురి రెండోసారి తల్లికాబోతుంది. ముందుగా ఈ జంటకి 2019 లో ఓ పాప. గీత మాధురి బిగ్ బాస్ షోకి వెళ్లి మరింతగా ఫేమస్ అయ్యింది. సింగర్ గా మంచి పేరున్న గీత మాధురి తన కుమార్తె దాక్షాయిణితో కలిసి కొన్ని యాడ్ షూట్స్ లో కూడా చేసింది.
ప్రస్తుతం గీత మాధురి తల్లికాబోతుండడంతో ఆమెకి నందు ఫ్యామిలీ ఘనంగా సీమంతం నిర్వహించింది. కుటుంభం సభ్యులు, స్నేహితులు నడుమ గీత మాధురి సీమంతం వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. గీత మాధురి సీమంతం ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఈ నెలలోనే గీత మాధురి రెండో బిడ్డకి జన్మనివ్వబోతోంది. ఆ ఆనందంలో భార్య భర్తలు సీమంతం వేడుకలో మెరిసిపోతూ కనిపించారు.