Advertisementt

ఓటీటీలోకి కెప్టెన్ మిల్ల‌ర్.. ఎప్పుడంటే

Mon 05th Feb 2024 12:43 PM
captain miller ott  ఓటీటీలోకి కెప్టెన్ మిల్ల‌ర్.. ఎప్పుడంటే
Captain Miller Movie OTT Release Date Fixed ఓటీటీలోకి కెప్టెన్ మిల్ల‌ర్.. ఎప్పుడంటే
Advertisement
Ads by CJ

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన తాజా సంచలనం కెప్టెన్ మిల్లర్ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా గత శుక్రవారమే తెలుగులో విడుదలైంది. తెలుగులో విడుదలైన రెండు వారాలకే ఈ సినిమా ఓటీటీలో దర్శనమివ్వనుంది. సంక్రాంతికి థియేటర్ల సమస్య తలెత్తడంతో.. టాలీవుడ్‌లో ఈ సినిమా విడుదల కాలేదు. జనవరి 26న థియేటర్లలో విడుదలై.. మిక్స్‌డ్ స్పందనను రాబట్టుకుంది. కోలీవుడ్‌లో మాత్రం ఈ సినిమా మంచి విజయాన్నే అందుకుంది. ధనుష్ ఖాతాలో మరో రూ. 100 కోట్ల చిత్రంగా అక్కడ కెప్టెన్ మిల్లర్ కలెక్షన్స్ రాబట్టింది.

ఇక ఈ సినిమా ఫిబ్రవరి 9 నుండి డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు రానుందని తెలుస్తుంది. నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ సంస్థ ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగు, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో ఏకకాలంలో స్ట్రీమింగ్‌కు సిద్ధం చేస్తోంది. యాక్షన్ ప్రియులకు నచ్చే ఈ సినిమాను ఓటీటీలో చూడొచ్చులే అని చాలా మంది థియేటర్ల వైపు వెళ్లలేదు. అలాంటి వారి కోసమే.. ముందే ఈ సినిమాని స్ట్రీమింగ్‌కు రెడీ చేస్తున్నారు.  ఇందులో ధనుష్ అగ్నీశ్వ‌ర్ పాత్ర నుండి కెప్టెన్ మిల్ల‌ర్‌‌గా ఎలా మారాడు అనేదే ఆసక్తికరమైన అంశం. ఓటీటీలో ఈ సినిమా తప్పకుండా మంచి ఆదరణను పొందుతుందని మేకర్స్ సైతం భావిస్తున్నారు.

ధ‌నుష్ సరసన ప్రియాంక అరుళ్ మోహ‌న్ న‌టించిన ఈ సినిమాలో క‌న్న‌డ స్టార్‌ శివ‌రాజ్ కుమార్, టాలీవుడ్ హీరో సందీప్ కిష‌న్ కీలక పాత్ర‌ల్లో న‌టించారు. అరుణ్ మాథేశ్వ‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా, జీవీ ప్ర‌కాశ్ సంగీతం అందించారు. స్వాతంత్య్రం రాక ముందు అంటే 1930 నుంచి 1940 మ‌ధ్య జ‌రిగే క‌థ‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులోని యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయనే టాక్ ఎలాగూ ఉంది కాబట్టి.. కచ్చితంగా ఓటీటీలో ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కే అవకాశమే ఉంది.

Captain Miller Movie OTT Release Date Fixed:

Captain Miller Movie OTT Streaming on Feb 9th

Tags:   CAPTAIN MILLER OTT
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ