సాయిపల్లవి తన సోదరి పూజా కన్నన్‌తో కలిసి వేసిన ఊర మాస్ స్టెప్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. సాయిపల్లవి సోదరి పూజా కన్నన్ నిశ్చితార్థం ఇటీవల గ్రాండ్‌గా జరిగిన విషయం తెలిసిందే. ఈ నిశ్చితార్థ వేళ.. తన సోదరికి అన్నీ దగ్గరుండి మరీ సాయిపల్లవి కేర్ తీసుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను పూజా కన్నన్ ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. ఇక ఈ వేడుకలో పూజా తనకు కాబోయే భర్త వినీత్‌తో కలిసి వేసిన ఊర మాస్ స్టెప్స్.. పక్కనే సాయిపల్లవి కూడా అందుకోవడంతో.. అతిథులందరూ కాలు కదిపారంటే.. ఏ రేంజ్‌లో వేడుక జరిగిందో అర్థం చేసుకోవచ్చు.
డ్యాన్స్ విషయంలో సాయిపల్లవి స్టామినా ఏంటో అందరికీ తెలుసు. ఆమె ఫాలోయింగ్‌ని చూసి.. సుకుమార్ వంటి దర్శకుడు ఆమెను లేడీ పవర్ స్టార్ అంటూ బిరుదు కూడా ఇచ్చారు. అలాంటి సాయిపల్లవి ఇంట పెళ్లి అంటే ఆ మాత్రం ఉండాలి కదా. అందుకే సాయిపల్లవి కూడా ఎక్కడా తగ్గలేదు. తన సోదరితో కలిసి ఆమె వేసిన ఊర మాస్ స్టెప్పులు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. విశేషం ఏమిటంటే.. ఈ వీడియోలను సాయిపల్లవి సోదరి, కాబోయే పెళ్లి కుమార్తె అయిన పూజా కన్నన్ షేర్ చేయడం.
ఈ వీడియోలో అక్కాచెల్లెళ్ల డ్యాన్స్ స్టెప్పులు చూసిన వారంతా.. సాయిపల్లవికి పూజా ఏ మాత్రం తీసిపోదు అంటూ కామెంట్స్ చేయడం మరో విశేషం. అందులోనూ తను ప్రేమించిన అబ్బాయితోనే తన పెళ్లి జరగబోతోంది. ఇంకేం కావాలి సంతోషం షేర్ చేసుకోవడానికి. అదే ఈ వేడుకలో కొట్టిచ్చినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియోలపై వార్తలు వైరల్ అవుతున్నాయి.