Advertisementt

ఇళయరాజా ఇంట తీవ్ర విషాదం

Thu 25th Jan 2024 09:21 PM
ilayaraja  ఇళయరాజా ఇంట తీవ్ర విషాదం
Ilayaraja house is a tragedy ఇళయరాజా ఇంట తీవ్ర విషాదం
Advertisement
Ads by CJ

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఇళయరాజా కుమార్తె, సింగర్ భవతారిణి క్యాన్సర్ తో ఈరోజు గురువారం సాయంత్రం శ్రీలంకలో కన్నుమూశారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న భవతారిణిని ఆయుర్వేద వైద్యం కోసం శ్రీలంకకు తీసుకెళ్లగా.. ఈరోజు సాయంత్రం 5.30 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. 

భవతారిణి వయసు 47 ఏళ్లు. దాదాపు 30కి పైగా చిత్రాల్లో ఎన్నో పాటలు పాడిన ఆమె గుర్తింపు పొందారు. ఇళయరాజా సంగీతం అందించిన రాసయ్య చిత్రంతో ఆమె గాయనిగా అరంగేట్రం చేశారు. భవతారిణి మృతి సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. భవతారిణి మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

Ilayaraja house is a tragedy:

Ilayaraja Daughter Bhavatharini Passes Away

Tags:   ILAYARAJA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ