Advertisementt

సునీల్ మోసపోతూనే ఉన్నాడు

Wed 24th Jan 2024 08:16 PM
trivikram  సునీల్ మోసపోతూనే ఉన్నాడు
Sunil keeps cheating సునీల్ మోసపోతూనే ఉన్నాడు
Advertisement
Ads by CJ

కమెడియన్ నుంచి హీరో కేరెక్టర్స్ కి షిఫ్ట్ అయ్యి.. వరస వైఫల్యాలతో మళ్ళీ కామెడీ అలాగే కొత్తగా విలన్ అవతారమెత్తిన సునీల్ ని ఆయన స్నేహితుడు టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ మోసం చేస్తున్నారా.. అవును తివిక్రమ్ సునీల్ కి ఇచ్చిన మాట కోసం ఏవో చిన్న చిన్న పాత్రలకే ఆయన సినిమాల్లో పరిమితం చేస్తున్నారనే వార్త.. ఈమధ్య కాలంలో త్రివిక్రమ్ సినిమాల్లో సునీల్ కేరెక్టర్ చూస్తే అర్ధమవుతోంది.

విలన్ గా పెద్ద సినిమాల్లో నటిస్తున్న సునీల్ త్రివిక్రమ్ సినిమా అనగానే.. ఆయన నా స్నేహితుడు తన సినిమాలో నాకు మంచి కేరెక్టర్ డిజైన్ చేసి ఉంటాడు అని, త్రివిక్రమ్ ని నమ్మి సినిమా చేస్తున్నాడు. కానీ సునీల్ మాత్రం ఒకటి రెండు సీన్స్ కే పరిమితమవ్వాల్సి వస్తుంది. ఎన్టీఆర్ తో అరవింద సమేతలో మంచి రోల్ చేసిన సునీల్, ఆ తర్వాత అలా వైకుంఠపురములో సినిమాలో చాలా చిన్న రోల్, అది కూడా ఎలాంటి ప్రాధాన్యత లేని రోల్ లో నటించాడు. ఇక రీసెంట్ గా గుంటూరు కారంలోను సునీల్ ఇలా వచ్చి అలా మాయమయ్యాడు. చాలా చిన్న రోల్.. అది చూసాకే సునీల్ స్నేహితుడు అని నమ్మి మోసపోతున్నాడని ప్రేక్షకులు, ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

మరి రూమ్ మేట్స్, స్నేహితుడు ప్రస్తుతం డౌన్ లో ఉన్నాడు, ఏ రోల్ ఇచ్చినా చేస్తాడు అనుకున్నారో ఏమో.. త్రివిక్రమ్ సునీల్ కి మరీ ప్రాధాన్యత లేని పాత్రలు ఇస్తున్నారు.. ఈ విషయంలో మాత్రం సునీల్ అభిమానులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.

Sunil keeps cheating:

Is Trivikram cheating on Sunil?

Tags:   TRIVIKRAM
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ