Advertisementt

దేవర డేట్ పై కన్నేసిన యంగ్ హీరో

Wed 24th Jan 2024 01:27 PM
devara  దేవర డేట్ పై కన్నేసిన యంగ్ హీరో
Family Star Eye on Devara Release Date దేవర డేట్ పై కన్నేసిన యంగ్ హీరో
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్-కొరటాల కాంబో దేవర మూవీ పోస్ట్ పోన్ అవ్వబోతున్నట్టుగా సోషల్ మీడియాలో కనిపించే న్యూసే కానీ.. ఇప్పటివరకు యూనిట్ నుంచి అధికారిక అప్ డేట్ ఏమి లేదు. కానీ దేవర పోస్ట్ పోన్ అవడం పక్కా అనే న్యూస్ లు మాత్రం విపరీతంగా స్ప్రెడ్ అయ్యాయి. అటు దేవర పై వస్తున్న న్యూస్ లని మేకర్స్ ఖండించకపోవడంతో.. దేవర విడుదల వాయిదా అనివార్యమన్న సంకేతాలు స్ప్రెడ్ అయ్యాయి. దానితో దేవర రిలీజ్ డేట్ ఏప్రిల్ 5 పై కొంతమంది హీరోలు కన్నేశారు.

ముఖ్యంగా సంక్రాంతికి రిలీజ్ అని ఇప్పుడు మార్చ్ కి పోస్ట్ పోన్ అయిన విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5 కి వచ్చే అవకాశాలున్నాయి అనడమే కాదు, ఆ తేదీ బావుంటుంది అనే ఆలోచనలో ఫ్యామిలీ స్టార్ మేకర్స్ ఉన్నారు.  పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మీద అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాల్లో మంచి అంచనాలున్నాయి. విజయ్ దేవరకొండ-పరశురామ్ కాంబోలో గీత గోవిందం బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో.. ఇప్పుడు ఫ్యామిలి స్టార్ పై అంతే అంచనాలు భారీగా పెరిగాయి.

మార్చ్ మొత్తం ఎగ్జామ్స్ ఫీవర్ లో ఉండే పిల్లలు.. ఏప్రిల్ మొదటివారానికి పరీక్షలు అయిపోయి సెలవుల్లో ఉంటారు కాబట్టి వసూళ్లకు ఢోకా ఉండదు.. అందుకే ఏప్రిల్ 5 దేవర పోస్ట్ పోన్ అనే న్యూస్ అధికారికంగా రాగానే ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5 కి ఫిక్స్ అయ్యేలా దిల్ రాజు పావులు కదుపుతున్నట్లుగా సమాచారం. 

Family Star Eye on Devara Release Date:

Jr NTR, Koratala Siva Devara release postponed from April 2024

Tags:   DEVARA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ