దేవర ఏప్రిల్ 5 కి రావడం లేదా, అనుకున్న తేదికి దేవర విడుదల అసాధ్యమా.. ఏమో.. ప్రస్తుతం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే కనిపించే న్యూస్ అదే. దేవర పై వస్తున్న ఈ గాలి వార్తలకి మేకర్స్ తగిన విధంగా స్పందిస్తేనే ఈ రకమైన వార్తలు ఆగుతాయి. అసలు ఈ వార్తలు పుట్టడానికి కారణం దేవర విలన్ సైఫ్ అలీ ఖాన్ గాయపడడమే. ఆయన దేవర సెట్స్ లో గాయపడి ముంబై ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఈరోజు మంగళవారమే హాస్పిటల్ ఉంచి డిశ్ ఛార్జ్ అయ్యి ఇంటికి వెళ్లారు.
మరి ఇప్పటివరకు షూటింగ్ ఫుల్ స్వింగ్ లోనే నడిచింది. రీసెంట్ గా రిలీజ్ చేసిన గ్లిమ్ప్స్ కూడా అభిమానులని బాగా ఇంప్రెస్స్ చేసాయి. ఎలాంటి ఆటంకాలు లేకుండా దేవర ఏప్రిల్ 5 కి వస్తుంది అనే కాన్ఫిడెన్స్ తో అభిమానులు ఉన్నారు. కానీ ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ గాయం కారణంగా షూటింగ్ కి బ్రేకులు పడ్డాయి. అందుకే దేవర ఏప్రిల్ 5 న విడుదల అవ్వకపోవచ్చనే ఊహాగానాలు స్ప్రెడ్ అయ్యాయి. మరి ఈ విషయంలో మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.