Advertisementt

SSMB29: మహేష్ ఇమేజ్ మరింత పెరుగుతుంది

Tue 23rd Jan 2024 10:20 AM
vijayendra prasad  SSMB29: మహేష్ ఇమేజ్ మరింత పెరుగుతుంది
Vijayendra Prasad about SSMB29 SSMB29: మహేష్ ఇమేజ్ మరింత పెరుగుతుంది
Advertisement
Ads by CJ

ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ ఇమేజ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఊహించనంతగా ఉంది.. అది SSMB29 తో మరింతగా పెంచే బాధ్యత తమది, ఈ ఒక్క సినిమాతోనే ప్యాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు రావాలని తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని రాజమౌళి తండ్రిగారు విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలను మహేష్ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. గుంటూరు కారం హడావుడి ఫినిష్ అవడంతో మహేష్ బాబు ఎప్పుడెప్పుడు రాజమౌళి తో సినిమా సెట్స్ లోకి అడుగుపెడతాడా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

తాజాగా విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో SSMB29 పై చాలా విషయాలు రివీల్ చేసారు. SSMB29 ఇండియానా జోన్స్ మాదిరి ఉండబోతుంది అని, భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్ర కథ అడవుల నేపథ్యంలో ఉండబోతుంది, అలాగని పిరియాడికల్ డ్రామా కాదని, ఇంకా ఈ చిత్రానికి టైటిల్ ఖరారు చెయ్యలేదు అని చెప్పారు, ప్రస్తుతం సంగీతం పై చర్చలు జరుగుతున్నాయని చెప్పారాయన. ఈ ఒక్క చిత్రంతోనే  మహేష్ కి ప్యాన్ ఇండియాలో భారీగా స్థాయి గుర్తింపు రావాలని, అందుకు తగ్గట్టుగా ప్రయత్నం చేస్తున్నామని చెబుతూ SSMB29 ప్రాజెక్ట్ పై అంచనాలు పదింతలు చేసేసారు. 

Vijayendra Prasad about SSMB29:

Vijayendra Prasad reveals details about Mahesh Babu – Rajamouli Pan World Project

Tags:   VIJAYENDRA PRASAD
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ