Advertisementt

ఎన్టీఆర్ ఫాన్స్ ఇలా ఫీలవుతున్నారు

Sun 31st Dec 2023 08:06 PM
ntr,devara  ఎన్టీఆర్ ఫాన్స్ ఇలా ఫీలవుతున్నారు
NTR fans are feeling like this ఎన్టీఆర్ ఫాన్స్ ఇలా ఫీలవుతున్నారు
Advertisement
Ads by CJ

గత నెలరోజులుగా ఈ న్యూ ఇయర్ కి దేవర నుంచి టీజర్ రాబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. దేవర తో కొరటాల శివ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళబోతున్నారు, చాలా పెద్ద సినిమా, దానికి అనుగుణంగానే దేవరని రెండు భాగాలుగా విడుదల చేస్తున్నాము, దానికి తగ్గ పనులు జరుగుతున్నాయి అంటూ కళ్యాణ్ రామ్ చెప్పడంతో.. ఈ న్యూ ఇయర్ కి పక్కాగా దేవర గ్లిమ్ప్స్ వస్తుంది అని ఎన్టీఆర్ అభిమానులు చాలా ఎగ్జైట్ అయ్యారు.

అయితే ఈ న్యూ ఇయర్ కి ఎన్టీఆర్ ఫాన్స్ డిస్పాయింట్ అవుతూ కనిపిస్తున్నారు. దేవర టీజర్ పై మేకర్స్ ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. మరి రేపే సోమవారం న్యూ ఇయర్. అసలే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ దేవర పై చేసిన చిన్నపాటి ట్వీట్ వైరల్ అయ్యి కూర్చుంది. న్యూ ఇయర్ కి సైలెంట్ గా ఏమైనా సర్ ప్రైజ్ ప్లాన్ చేసారా..  అసలు ఎలాంటి క్లూ ఇవ్వకుండా ఫ్యాన్ ఇండియా టీజర్ వదులుతారా అనేది కాస్త డౌట్ కొడుతోంది. అందుకే ఎన్టీఆర్ ఫాన్స్ కూడా కాస్త బాధగానే కనిపిస్తూ సోషల్ మీడియాలో మీమ్స్ రేజ్ చేస్తూ బ్రహ్మి నిరాశక్తితో ఉన్న పిక్స్ ని, వీడియోస్ ని షేర్ చేస్తున్నారు. 

అయితే దేవర టీజర్ అప్ డేట్ రేపు జనవరి 1 న న్యూ ఇయర్ రోజున పోస్టర్ తో సహా మేకర్స్ ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తుంది. అదే విషయాన్ని సోషల్ మీడియాలో కొంతమంది ట్రెండ్ చేస్తున్నారు. అలాగే దేవర హ్యాష్ టాగ్ కూడా ఈరోజు ఆదివారం ఉదయం నుంచి ట్రెండ్ అవుతూ కనిపిస్తుంది.

NTR fans are feeling like this:

Devara teaser update tomorrow

Tags:   NTR, DEVARA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ