విజయ్ దేవరకొండ-రష్మిక ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. వాళ్ళు గీత గోవిందం, డియర్ కామ్రేడ్ మూవీస్ చేసినప్పటినుంచి ఫ్రెండ్ షిప్ మైంటైన్ చేస్తున్నారు. అయితే ఎక్కువగా రష్మిక విజయ్ ఫ్యామిలీతో కలిసి కనిపించడం, అలాగే విజయ్ దేవరకొండ-రశ్మికలు కలిసి వెకేషన్స్ కి వెళ్లడం, డిన్నర్ డేటింగ్స్ అంటూ హడావిడి చెయ్యడంతో అందరూ విజయ్ దేవరకొండ-రష్మక్ ఫ్రెండ్ షిప్ లో కాదు ప్రేమలో ఉన్నారని అనుకుంటున్నారు. అదే విషయం వాళ్ళని అడిగితే మేము మంచి ఫ్రెండ్ అంటారు.
అదలాఉంటే అర్జున్ రెడ్డి సక్సెస్ పార్టీలోనే రష్మిక కనిపించింది అంటూ ఈ మధ్యనే గుట్టు బయటికి రావడంతో రష్మిక, విజయ్ మధ్యలో ఖచ్చితంగా ప్రేమే ఉంది అంటున్నారు. ఇక తాజాగా రష్మిక తన ఫ్రెండ్ విజయ్ దేవరకొండ బిజినెస్ ని ప్రమోట్ చేస్తుంది. విజయ్ దేవరకొండ సినిమాలతో పాటుగా.. RWDY బ్రాండ్ ఓపెన్ చేసి దుస్తులు, చెప్పులు వంటి బిజినెస్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ RWDY బ్రాండ్ ప్రమోషన్స్ లో రష్మిక కనిపించి షాకిచ్చింది.
విజయ్ దేవరకొండ ఈరోజు నవంబర్ 30 న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసేందుకు RWDY బ్రాండ్ టీ షర్ట్ వేసుకుని వచ్చాడు. అదే సమయంలో రష్మిక ముంబై ఎయిర్ పోర్ట్ లో అదే RWDY బ్రాండ్ టీ షర్ట్ అంటే అచ్చం విజయ్ దేవరకొండ వేసుకున్న టీ షర్ట్ తో కనిపించి షాకిచ్చింది. అది చూడగానే రష్మిక విజయ్ దేవరకొండ బ్రాండ్ ని ప్రమోట్ చేస్తుంది.. విజయ్ కోసం ఎంతగా కష్టపడిపోతుందో అంటూ విజయ్ దేవరకొండ-రష్మిక ఫొటోస్ పక్కపక్కన బెట్టి మరీ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.