సర్వేలన్నీ కాంగ్రెస్‌కే పట్టం..

Thu 30th Nov 2023 07:40 PM
assembly elections 2023  సర్వేలన్నీ కాంగ్రెస్‌కే పట్టం..
All the surveys belong to Congress సర్వేలన్నీ కాంగ్రెస్‌కే పట్టం..

పోలింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్ సర్వేలు వచ్చేశాయి. మొత్తంగా గంపగుత్తగా ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ కాంగ్రెస్‌కే పట్టం కట్టాయి. ఒక్క హైదరాబాద్‌లో మినహా ఎక్కడా కూడా బీఆర్ఎస్ పార్టీకి సీట్లు ఎక్కువగా వచ్చే అవకాశం లేదని సర్వేలు తేల్చాయి. రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు సరిసమానంగా సీట్లను గెలుచుకుంటాయని సర్వేలు చెబుతున్నాయి. ఇక మిగిలిన అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీయే అత్యధిక సీట్లను గెలుచుకుంటుందని తెలిపాయి. ఉమ్మడి ఖమ్మం, నల్గొండలలో కాంగ్రెస్ అత్యధికంగా సీట్లను కైవసం చేసుకునే అవకాశం ఉందని సర్వే తెలిపింది. ఇక మొత్తంగా కాంగ్రెస్ పార్టీ 65-68 సీట్లు గెలుచుకుంటుందని.. బీఆర్ఎస్ 35-40 సీట్లు.. బీజేపీ 7-10 సీట్లు.. ఎంఐఎం 6-7 సీట్లు, ఇతరులు 1-2 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని ఓ సర్వే సంస్థ తేల్చింది.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత..

బీఆర్ఎస్ పార్టీకి వరుసగా రెండు సార్లు అవకాశం ఇచ్చామని ఇప్పుడు వేరే పార్టీకి అవకాశం ఇస్తే ఎలా ఉంటుందో చూడాలని జనం భావిస్తున్నారట. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు హామీలు సైతం అధికారాన్ని కట్టబెట్టనున్నాయట. ఇక బీఆర్ఎస్ పార్టీ మెజారిటీ టికెట్లను సిట్టింగ్‌లకు ఇవ్వడం కూడా ఆ పార్టీకి చేటు తెచ్చిందని సర్వే సంస్థ తెలిపింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులపై ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి వరంలా మారిందట. అలాగే బీఆర్ఎస్ పార్టీ ఈ మధ్య కాలంలో ప్రకటించిన దళిత బంధు, బీసీ బంధు పథకాలు పథకాలు కేవలం వారి పార్టీ కార్యకర్తలకి, బీఆర్ఎస్ నాయకులకు మాత్రమే వస్తున్నాయనే అసంతృప్తి మెజారిటీ ప్రజలలో ఉండటం కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చిందట. 

నాగన్న సర్వే సంస్థ

నాగన్న సర్వే సంస్థ మాత్రం బీఆర్ఎస్‌కు అధికారాన్ని కట్టబెట్టింది. బీఆర్ఎస్‌కు 61-68 సీట్లు వస్తాయని తెలిపింది. ఇక కాంగ్రెస్‌కు 34-40, బీజేపీకి 3-5, ఎంఐఎంకు 5-7, ఇతరులు ఒక స్థానాన్ని గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది. 

ఆరా మస్తాన్ అనే సర్వే సంస్థ..

బీఆర్ఎస్ 41 - 49 సీట్లు (39.58)

కాంగ్రెస్ - 58 - 67 సీట్లు (41.13)

బీజేపీ 5 - 7 సీట్లు( 10.47)

ఏంఐఏం, బీఎస్పీ, సీపీఐ  7 - 9 సీట్లు (8.82) వస్తాయని తెలిపింది.

All the surveys belong to Congress:

Telangana Assembly Elections 2023 Exit Poll Results