ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియా యుద్ధానికి సిద్ధమయ్యారు. అసలే రాధేశ్యామ్, ఆదిపురుష్ డిజాస్టర్స్‌తో మంచి ఆకలి మీదున్నారు. సలార్‌తో అది తీరుతుంది అనుకుంటే.. సలార్ సెప్టెంబర్ 28 నుంచి పోస్ట్ పోన్ అయ్యి అప్పుడు అభిమానులని బాగా డిజప్పాయింట్ చేసింది. కానీ డిసెంబర్ 22కి షిఫ్ట్ అవడంతో మళ్ళీ యాక్టీవ్ అయ్యారు. ఇక సలార్ నుంచి రేపు సోమవారం ప్రభాస్ బర్త్‌డేకి ట్రైలర్ వదులుతారనే ఆశలో ఉన్నారు. సలార్ ట్రైలర్ వచ్చాక అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.. క్రేజ్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోతుంది అనే ధీమాలో అభిమానులు ఉన్నారు.
రికార్డ్స్ వ్యూస్, షేర్స్‌తో భీభత్సమే అన్న ఊపులో ఉన్నారు. కానీ ఇప్పుడు సలార్ నుంచి ట్రైలర్ వచ్చే ఛాన్స్ లేదు. రెండు నెలల ముందే ప్రభాస్ బర్త్‌డే అని ట్రైలర్ వదిలితే రిలీజ్ టైంకి క్రేజ్ తగ్గుతుంది అనే ఆలోచనలో మేకర్స్.. ఈ బర్త్‌డేకి జస్ట్ సలార్‌లోని ప్రభాస్ సరికొత్త పోస్టర్‌ని వదలాలి అనుకుంటున్నారట. అంటే రేపు సలార్ నుంచి ప్రభాస్ స్పెషల్ పోస్టర్ మాత్రమే రాబోతుంది.
మరి ట్రైలర్ కోసం ఎక్స్‌పెక్ట్ చేసిన అభిమానులు జస్ట్ పోస్టర్‌తో సరిపెట్టుకోవాల్సిందే. ఇది అభిమానులని డిజప్పాయింట్ చేసే విషయమే. మరి సలార్ నుంచి పోస్టర్, ఇంకా కల్కి నుంచి మరో పోస్టర్, మారుతి మూవీ నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్.. ఛత్రపతి రీ రిలీజ్‌లతోనే ఫ్యాన్స్ ప్రభాస్ బర్త్‌డేని సెలెబ్రేట్ చేసుకోవాలి.