అనసూయ బుల్లితెర మీద నుంచి ఎగ్జిట్ అయినా.. వెండితెర మీద తనకు నచ్చిన పాత్రల్తో బిజీగా మారిపోయింది. అనసూయ ఎక్కడ ఎలా ఉన్నా, ఎంత బిజీగా కనిపించినా సోషల్ మీడియాలో మాత్రం చాలా అంటే చాలా యాక్టీవ్ గా ఉంటుంది. బుల్లి ఫ్రాక్ వేసినా.. కంచి పట్టు చీర కట్టినా సోషల్ మీడియాలో ఆ ఫోటో షూట్ షేర్ చెయ్యందే నిద్ర పోదు, ఫ్యామిలీ వెకేషన్ అయినా, రిబ్బన్ కటింగ్స్ అయినా దేన్నీ వదలదు.
ఇక ఈ మధ్యన రెండు సినిమాల షూటింగ్స్, మూడు షాప్ ఓపినింగ్స్ అంటూ ఎక్కడ చూసినా అనసూయే దర్శనమిస్తుంది. కొద్దిరోజులుగా అనసూయ కాస్త బరువు పెరిగినట్లుగా కనిపిస్తుంది. జిమ్ లో ఎన్ని వర్కౌట్స్ చేస్తున్నా అనసూయ బరువు మాత్రం తగ్గడం లేదు. అయినా శారీస్ తో కవర్ చేస్తూ రోజుకో పట్టు చీరతో దర్శనమిస్తుంది. తాజాగా కంచి పట్టు చీరలో అనసూయ అందాలు మరింత బ్రైట్ గా మెరిసిపోతున్నాయి.
కర్నూల్ లో గౌరీ సిల్క్స్ షాప్ ఓపెనింగ్ కి వెళ్లొచ్చిన అనసూయ ఆ గౌరీ సిల్క్స్ సారీ పిక్స్ తో పాటుగా.. It is in my mind.. and soon enough.. it will be in my life too అంటూ క్యాప్షన్ పెట్టింది. బేబీ పింక్ పట్టు చీరలో అనసూయ కొప్పు ముడికట్టి హొయలు పోతున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.