బిగ్ బాస్ సీజన్ 7 ఏంటో ఉల్టా పుల్టా అంటూ కింగ్ నాగార్జున బుల్లితెర ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తున్నారు. నిజంగానే బిగ్ బాస్ 7 లో రకరకాల వింతలు విశేషాలు అన్నట్టుగా జరుగుతున్నాయి. సీజన్ 7 నుంచి వరసగా అమ్మాయిలే ఎలిమినేట్ అవుతున్నారు. అబ్బాయిలు ఇంకా గుంపులు గుంపులుగానే కనిపిస్తున్నారు. ఇక గత రాత్రి ఆరో ఎలిమినేషన్ భాగంగా నాయని పావని ఎలిమిషన్ ఎవరికీ నచ్ఛలేదు. మంచి యాక్టీవ్ గా ఉండే అందమైన అమ్మాయిని ఎలిమినేట్ చెయ్యడం పట్ల బిగ్ బాస్ ని నెటిజెన్స్ ట్రోల్ చేస్తున్నారు.
నయని పావని ఎలిమినేషన్ భారంగా సాగింది. నాగార్జున తో నించున్న నయని స్టేజ్ పై ఏడుస్తూనే కనిపించింది. శివాజీని డాడ్ అంటూ అందరితో కన్నీళ్లు పెట్టించింది. అయితే నయని పావని ఎలిమినేషన్ ముగిసాక ఈరోజు హౌస్ లోకి రతిక రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. ఎవరికైతే ఓట్స్ తక్కువ వచ్చాయో వారు హౌస్ లోకి రాబోతున్నారు. ఇక ఈ రోజు హౌస్ నుంచి శివాజీ వెళ్లిపోయిన ప్రోమో వైరల్ అయ్యింది.
శివాజీని బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి మీరు ఇంటి నుంచి బయటికి వెళ్లొచ్చు అన్నారు. అక్కడి నుంచి బయటికొచ్చిన శివాజీ నేను వెళుతున్నాను బయటికి అంటూ హౌస్ మేట్స్ అందరికి బిగ్ షాక్ ఇచ్చాడు. అందరూ అన్నా వెళ్లొద్దు అని బ్రతిమాలారు, కన్నీళ్లు పెట్టుకున్నారు. కానీ గేట్స్ ఓపెన్ అవ్వగానే శివాజీ వెళ్ళిపోయాడు. ఆ దెబ్బకి అందరూ షాక్ లో ఉండిపోయారు. మరి శివాజీ హెల్త్ రీజన్స్ వలనే హౌస్ నుంచి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. అతన్ని డాక్టర్స్ పరీక్షించాక హౌస్ లోకి వస్తాడా.. లేదంటే ఇంటికి వెళ్ళిపోతాడా అనేది తెలుస్తుంది.