లోకేష్ కనగరాజ్ అంటే తెలుగు ఆడియన్స్ కి పిచ్చ క్రేజ్.. ఖైదీ మూవీలాగే విక్రమ్ మూవీస్ తర్వాత లోకేష్ కనగరాజ్ కి టాలీవుడ్ హీరోలే కాదు.. ఆడియన్స్ చాలామంది అభిమానులైపోయారు. అది విక్రమ్ తర్వాత మరింతగా ఎక్కువైంది. అయితే ఇప్పుడు విజయ్ తో చేసిన లియో మూవీని అక్టోబర్ 19 న విడుదల చేస్తున్నారు. అయితే తమిళంలోనే విజయ్ ప్రమోషన్స్ కి వెళ్ళలేదు. ఇక మిగతా భాషలైనా అంతే. లోకేష్ కనగరాజ్ తమిళనాట తెగ ఇంటర్వూస్ ఇస్తున్నాడు.
అయితే లియో మూవీపై తమిళనాట విజయ్ హీరో కాబట్టి క్రేజ్ ఉండొచ్చు.. కానీ తెలుగులో లియో పై ప్రేక్షకుల్లో అంతగా ఆసక్తి కనిపించడం లేదు. 19న రాబోతున్న భగవంత్ కేసరి, 20 న రాబోతున్న రవితేజ టైగర్ నాగేశ్వరావు పై కనిపిస్తున్న ఇంట్రెస్ట్ విజయ్ లియోపై కనిపించడం లేదు కేవలం ప్రమోషన్స్ లేవనే కాదు.. లియో ట్రైలర్ వచ్చాక జనాల్లో ఆ సినిమాపై అంచనాలు తగ్గాయి. అటు అనిరుద్ మ్యూజిక్ కూడా విక్రమ్, జైలర్ లా లేదు అనే మాట వినబడుతుంది.
లియో పై ఇంట్రస్ట్ తగ్గడానికి అనిరుధ్ మ్యూజిక్, లియో ట్రైలర్ అలాగే ప్రమోషన్స్ లేకపోవడం, ఎ హిస్టరీ ఆఫ్ వయొలెన్స్ ఫ్రీమేక్ అని ప్రచారం జరగడం ఇవన్నీ తెలుగులో లియో మీద క్రేజ్ తగ్గడానికి గట్టి కారణాలుగా కనబడుతున్నాయి. లోకేష్ కనగరాజ్ పై ఉన్న నమ్మకమూ సన్నగిల్లింది. అందుకే ఈసారి ప్రేక్షకులు తెలుగు సినిమాలపైనే ఫోకస్ పెట్టి డబ్బింగ్ సినిమాని లైట్ తీసుకుంటున్నారనిపిస్తుంది.