ప్రభాస్-మారుతి కలయికలో రాబోతున్న మూవీ షూటింగ్ గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న విషయం తెలిసిందే. మారుతితో ప్రభాస్ సినిమా చెయ్యడం ఇష్టం లేని ప్రభాస్ ఫాన్స్ మారుతిని విపరీతంగా ట్రోల్ చేశారు. దానితో కోపం తెచ్చుకుని మారుతి కసిగా ప్రభాస్ సినిమా చేస్తున్నాడు. నిన్న సోషల్ మీడియాలో మారుతి ట్రెండ్ అయ్యాడు. మారుతి బర్త్ డే స్పెషల్ అయినా.. ఏ బర్త్ డే కి లేని స్పెషల్ ఈ బర్త్ డే లో కనిపించింది. కారణం ప్రభాస్ సినిమానే.
అయితే తన సినిమాకి సంబంధించి ఇప్పటివరకు అప్ డేట్ ఇవ్వకపోవడానికి కారణం అభిమానులని గందరగోళం చెయ్యలేక అంటూ ఏదో చెప్పుకొచ్చాడు. ఆయన చేతిలో వరసగా ప్యాన్ ఇండియా మూవీస్ ఉన్నాయి. ఆ అప్ డేట్స్ తో సోషల్ మీడియా మొత్తం హడావిడి ఉంటుంది. అలాంటి సమయంలో తన అప్ డేట్ ఇచ్చి ఫాన్స్ ని కన్ఫ్యూజ్ చెయ్యలేను అన్నాడు. ఇప్పుడు మారుతి ప్రభాస్ బర్త్ డే కి ఓ స్పెషల్ ట్రీట్ సిద్ధం చేస్తున్నాడట.
ఈ చిత్రం కోసం మూడు టైటిల్స్ అనుకుంటున్నాడట మారుతి. కానీ ప్రభాస్ బర్త్ డే రోజున టైటిల్ ప్రకటించకపోయినా.. ప్రభాస్ లుక్ రివీల్ చెయ్యడానికి రెడీ అవుతున్నట్లుగా మారుతి బర్త్ డే స్పెషల్ ఇంటర్వూస్ లో రివీల్ చేసాడు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గ తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ ఫన్నీగా కనిపించడమే కాదు.. చాలా యంగ్ గా కనిపిస్తాడంటూ మారుతి ఫాన్స్ లో క్యూరియాసిటీ క్రియేట్ చేసాడు.