సుశాంత్ సింగ్ ఆత్మహత్య రియా చక్రవర్తి ని జైలు పాలు చేసింది. సుశాంత్ సింగ్ రాజ్ ఫుట్ తన ఫ్లాట్ లోనే ఆత్మహాత్య చేసుకుని మృత్యువడిలోకి చేరిపోయాడు. ఆ కేసు రియా చక్రవర్తి, ఆమె సోదరుడు మెడకి చిక్కుకుంది. సుశాంత్ సింగ్ కి డ్రగ్స్ అలవాటు చేసి అతని ఆత్మహత్యకి కారణమయ్యారంటూ రియా ని ఆమె సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేసారు. ఆ తర్వాత ఆమె బెయిల్ పై బయటికొచ్చింది. ఆ కేసులో మీడియాకి టార్గెట్ గా మారిన రియా చాలా ప్రోబ్లెంస్ ఫేస్ చేసింది.
తాజాగా సుశాంత్ సింగ్ మరణం తర్వాత, ఆమె జీవితంపై రియా చక్రవర్తి స్పందించింది. సుశాంత్ మరణంగా తర్వాత ఆప్తురాలిగా, ఆత్మీయ స్నేహితురాలిగా ఆ సమయంలో తనకు మనసులో బాధను దించుకునేలా ఏడ్చేందుకు కూడా సమయం దొరకనీయలేదని, అత్యంత ఆప్తుడిని పోగొట్టుకున్న బాధ ఒక వైపు, మీడియాలో తనను విలన్ గా చూపిస్తున్న బాధ మరోవైపు.. ఇలా చుట్టూ సమస్యలతోనే సతమతమయ్యానని, సుశాంత్ సింగ్ మరణం తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయింది.
సుశాంత్ మరణం తనకు తీరని లోటని,. సుశాంత్ లేకుండా జీవించడం చాలా కష్టం, మనమంతా మనుషులం కాబట్టి అన్ని మర్చిపోయి ముందుకు సాగక తప్పదని చెప్పిన రియా చక్రవర్తి.. ఆ విషాదం నుంచి కోలుకోవడానికి తనకు చాలా సమయం పట్టిందని ఆమె చెప్పుకొచ్చింది.