అనసూయ ఈ మద్యన శారీ షో చేస్తుంది. పెదకాపు1 ప్రమోషన్స్ లో అనసూయ ప్రెస్ మీట్స్ లోను, ప్రీ రిలీజ్ ఈవెంట్ లోను, ఇంటర్వూస్ లోను శారీ కట్టి ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రోజుకో కలర్ ఫుల్ శారీ షో చేసేది. అలాగే ఈ మద్యన షాపింగ్ మాల్ ఓపెనింగ్ లోను అనసూయ కాంజీవరం పట్టు చీరలో అదరగొట్టేసింది.
అయితే ఇప్పుడు శారీ లో నుంచి మోడ్రెన్ అవుట్ ఫిట్ లోకి మారిపోయింది. కారు డోర్ లో అనసూయ మోడ్రెన్ డ్రెస్ లో కూర్చుని ఫొటోలకి ఫోజులిచ్చింది. వైట్ టాప్ లో మెరిసిపోయింది. శారీస్ లో కాస్త బరువు పెరిగినట్టుగా కనిపించిన అనసూయ భరద్వాజ్ జిమ్ లో భర్త భరద్వాజ్ తో కలిసి కష్టపడుతూ బరువుని కంట్రోల్ లో పెట్టినట్లుగా ఈ మోడ్రెన్ డ్రెస్ లో ఆమె కనిపించింది.
ఈ మోడ్రెన్ లుక్ లో అనసూయ ఫొటోస్ తో పాటుగా Status : Happy. Unbothered. Disciplined. Glowing. ✨🧿 అంటూ క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం అనసూయ న్యూ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.