మలయాళ కుట్టి మాళవిక మోహనన్ ప్రస్తుతం తమిళనాట స్టార్ హీరోయిన్ చైర్ కోసం తెగ కష్టపడుతుంది. మలయాళ, తమిళ అవకాశాలే కాదు.. ఇప్పుడు ఈపాపకి టాలీవుడ్ లో బిగ్ స్టార్ ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన జత కట్టే అవకాశం లభించింది. ప్రభాస్-మారుతి కాంబో మూవీలో మాళవిక మోహనన్ నటిస్తుంది.
అయితే #AskMalavika అంటూ ట్విటర్ లో అభిమానుల చిట్ చాట్ చేస్తుంది మాళవిక. అందులో భాగంగా 2డిసెంబర్ 2 న రాబోతున్న సలార్ ని కోసం వెయిట్ చేస్తున్నారా.. లేదంటే షారుఖ్ డుంకీ ని ఇష్టపడతారా అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకి మాళవిక తనదైన స్టయిల్లో సమాధానమిచ్చింది. తాను సలార్, డుంకీ రెండు సినిమాల కోసం వెయిట్ చేస్తున్నాను, అందులో ఒకటి ఎంపిక చేసుకోవాలంటే తాను సలార్ నే చూజ్ చేసుకుంటానంటూ ప్రభాస్ అభిమానులని పడేసింది.
సలార్ కోసం ఎందుకంతగా వెయిట్ చేస్తున్నాను అంటే.. ఆ చిత్రంలో ప్రభాస్-పృథ్వీ రాజ్ సుకుమారన్ లు కూల్ గా కనిపిస్తున్నారంటూ మాళవిక మోహనన్ ఆన్సర్ ఇచ్చింది.