అంబానీ హౌస్ లో ఎప్పుడు ఏదో ఒక ఫెస్టివల్ లేదంటే ఏదో ఒక శుభకార్యం జరగడం.. ఆ ఈవెంట్స్ కి బాలీవుడ్ సెలబ్రిటీస్ హాజరవడం చూస్తూనే ఉంటాము. సౌత్ నుంచి హిందీలో కాలు పెట్టి అక్కడ సినిమాలు చేసుకునే రష్మిక, రాశి ఖన్నా, తమన్నా, సమంత ఇలా హిందీ తారలతో కలిసి సీతాకోక చిలుకల్లా అంబానీ ఇంట్లోనే కాదు.. బాలీవుడ్ లో ఏ సెలెబ్రిటీ ఇంట పార్టీ జరిగనా అక్కడ వాలిపోతూ ఉంటారు. అయితే ఈసారి ముంబైలో అంబానీ హౌస్ లో జరిగిన వినాయకచవితి వేడుకల్లో స్పెషల్ గా నయన్ జంట కనిపించింది.
ముఖేష్ అంబానీ-నీత అంబానీల వినాయక పూజలో బాలీవుడ్ నుంచి ఎంతో మంది సెలబ్రిటీస్ హాజరయ్యారు. రష్మిక, జాన్వీ కపూర్ ఇలా చాలామంది హాజరైనా అక్కడ ప్రత్యేకంగా నయనతార ఆమె భర్త విగ్నేష్ శివన్ ల జంట కనిపించింది. వైట్ అండ్ వైట్ అవుట్ ఫిట్ లో ఈ జంట మెరిసిపోయిది. ఇప్పటివరకు నయనతార బాలీవుడ్ జరిగిన వేడుకల్లో కానీ, ఈవెంట్స్ లో కానీ పెద్దగా కనిపించలేదు.
కానీ ఈ ఏడాది జవాన్ సినిమా తో షారుఖ్ హీరోగా నయనతార హిందీలోకి అదిరిపోయే హిట్ తో ఎంట్రీ ఇచ్చింది. డెబ్యూ మూవీతోనే 900 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టిన ప్రాజెక్ట్ తో నయనతార రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంత సక్సెస్ జోష్ లో ఉన్న నయనతార భర్త విగ్నేష్ తో కలిసి అంబానీ ఇంటికి వెళ్ళింది. ఫోట్లకి ఫోజులిచ్చింది. ఇక రీసెంట్ గానే కొడుకులతో కలిసి భర్త విగ్నేష్ బర్త్ డేని ఇంట్లోనే నయనతార సెలెబ్రేట్ చేసిన విషయం తెలిసిందే.