మాస్ మహారాజ్-గోపీచంద్ మలినేని కలయికలో క్రేజీ మూవీగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో మొదలు కాబోయే చిత్రంలో రవితేజ తో మరోమారు శ్రీలీల జోడి కడుతుంది. ధమాకా సక్సెస్ ని రవితేజ-శ్రీలీల కంటిన్యూ చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే రవితేజ తో ఇప్పుడు శ్రీలీల కాదు.. క్రేజీ ప్యాన్ ఇండియా హీరోయిన్ రష్మిక నటిస్తుందట.
ప్రస్తుతం రవితేజ టైగర్ నాగేశ్వరరావు ని ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నాడు. అక్టోబర్ 20 న ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. తర్వాత సంక్రాంతికి ఈగల్ మూవీతో రవితేజ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పుడు తాజాగా తనని సక్సెస్ ట్రాక్ లోకి తీసుకొచ్చిన గోపీచంద్ తో రవితేజ జట్టు కట్టాడు. ఈచిత్రంలోనే ఈ క్రేజీ గర్ల్ రష్మిక జాయిన్ అవ్వబోతుంది.
ఇప్పటివరకు రష్మిక రవితేజతో కలిసి నటించలేదు. ఈచిత్రంతో జంటగా మొదటిసారి కనిపించబోతున్నారు.. అంటే ఈ జంట ఫ్రెష్ గా కనిపించడం ఖాయం. రవితేజ-రష్మిక కలిసి గోపీచంద్ మలినేని మూవీ కోసం రెడీ కాబోతున్నారు. రష్మిక ప్రస్తుతం తెలుగు, హిందీ, తమిళ చిత్రాలతో బాగా బిజీగా ఉన్న తార.