దేవర మూవీ సెట్స్ మీదకి వెళ్లకముందే ఆ చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైన జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ ని మార్చ్ మొదటి వారంలోనే ఆమె పుట్టిన రోజు సందర్భంగా రివీల్ చేసారు కొరటాల శివ. ఇక ఎన్టీఆర్ బర్త్ డే మే 20 న దేవర నుండి ఎన్టీఆర్ మాస్ పవర్ ఫుల్ లుక్ వదిలారు. దేవర రెగ్యులర్ షూట్ మొదలైనప్పటినుండి ఇప్పటివరకు ఫుల్ స్వింగ్ లో చిత్రీకరణ జరపడమే కాదు.. సోషల్ మీడియాలో అభిమానులకి దేవర మేకర్స్ అందుబాటులో ఉంటూ దేవర అప్ డేట్స్ తో పిచ్చెక్కిస్తున్నారు.
తాజాగా దేవర సినిమాలో విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ కూడా రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఆగష్టు 16 న సైఫ్ అలీ ఖాన్ పుట్టిన రోజు సందర్భంగా దేవర నుండి విలన్ లుక్ ని వదులుతారని అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి దేవర నుండి ఫుల్ స్వింగ్ లో అప్ డేట్స్ వస్తున్నట్టుగానే ఆగష్టు 16 న సైఫ్ లుక్ కూడా వచ్చేస్తుంది ఇది పక్కా అంటూ ఎన్టీఆర్ ఫాన్స్ ఫిక్స్ అవుతున్నారు.