ధమాకా తో జోడి కట్టి బాక్సాఫీసుని షేకాడించిన రవితేజ-శ్రీలీలలు మరోసారి కలిసి నటించబోతున్నారనే న్యూస్ వాళ్ళ ఫాన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ధమాకా సినిమాలో డాన్స్ లతో రఫ్ఫాడించిన ఈజోడి మళ్ళీ వెండితెరపై కనువిందు చేస్తే ఆ క్రేజ్ వేరే లెవల్. ప్రస్తుతం రవితేజ టైగర్ నాగేశ్వరరావుతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉన్నాడు. అక్టోబర్ 20న దసరా స్పెషల్ గా టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ అవ్వబోతుంది.
అలాగే మరో మూడు నెలల్లో అంటే సంక్రాంతికి ఈగల్ తో మళ్ళీ ప్రేక్షకులని పలకరించబోతున్నాడు. ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్ గోపీచంద్ మలినేని తో మొదలు పెట్టెయ్యడానికి రెడీగా వున్నాడు. క్రాక్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రవితేజ-గోపీచంద్ మలినేని లు ఇంకోసారి సెట్స్ మీదకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో మొదలు కాబోయే ఈ చిత్రంలో రవితేజకి జోడిగా శ్రీలీల ని హీరోయిన్ గా కన్ ఫర్మ్ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 11 నుండి మొదలు పెట్టాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారుది. మరి రవితేజ-శ్రీలీల లు ఈసారి ప్రేక్షకులని ఏం మాయ చేస్తారో చూద్దాం.