బేబీ విడుదలై మూడు వారాలవుతున్నా ఇంకా బేబీ ముచ్చట సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. చిన్న సినిమాగా విడుదలై ఇప్పుడు కలెక్షన్స్ పరంగా పెద్ద సినిమాగా టర్న్ అయిన బేబీ మూవీ ఎంత హిట్ అయినా రెండు వారాలకే ముగించేస్తుంది.. ఇకపై ఓటిటిలోనే అనుకుంటే మూడో వారంలోను బ్రో ని తొక్కేసి మరీ ఎగిసెగిసి పడుతుంది. అందుకే చిత్ర బృందం కూడా ఇంకా ఇంకా సినిమాని ప్రమోట్ చేస్తూనే ఉంది.
తాజాగా బేబీ నిర్మాత SKN అలాగే హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవి చైతన్య, విరాజ్ లు అందరూ కలిసి బేబీ ని ప్రమోట్ చేస్తూ థియేటర్లు ని విజిట్ చేస్తున్నారు. అయితే భీమవరంలో బేబీ చిత్ర యూనిట్ వస్తుంది అని తెలిసి పెద్ద ఎత్తున జనాలు పోగయ్యారు. అక్కడ మీడియాతో బేబీ నిర్మాత గొడవ పడిన దృశ్యాలు, అలాగే SKN బౌన్సర్లు అత్యుత్సాహంతో జర్నలిస్టులకి నెట్టిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఆ గొడవలో ఓ జర్నలిస్ట్ కి గాయమైనట్టుగా తెలుస్తుంది. బేబీ నిర్మాత మీడియా వాళ్లతో గొడవ పడుతున్న విజువల్స్ ప్రముఖంగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. భీమవరంలో బేబీ చిత్ర యూనిట్ అత్యుత్సాహం. కవరేజ్ కు వచ్చిన మీడియాపై బౌన్సర్లతో దాడి, మీడియా ప్రతినిధుల పై నిర్మాత SKN దౌర్జన్యం.. ఓ జర్నలిస్టులకు గాయాలు.. అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.