Advertisementt

వైరల్: దీపికా పై ప్రభాస్ కామెంట్స్

Thu 03rd Aug 2023 02:41 PM
prabhas  వైరల్: దీపికా పై ప్రభాస్ కామెంట్స్
Viral: Prabhas comments on Deepika వైరల్: దీపికా పై ప్రభాస్ కామెంట్స్
Advertisement
Ads by CJ

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ఫస్ట్ సౌత్ మూవీని..  ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కలిసి నటిస్తుంది. కల్కి 2898 ఏడీ మూవీలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న దీపిక కల్కి ఫస్ట్ లుక్ ఆమె అభిమానులని సర్ ప్రైజ్ చేసాయి. అయితే ప్రభాస్ తో సెట్స్ లో జాయిన్ అయిన కొత్తల్లోనే ఆమెకి ప్రభాస్ ఇంటి నుండి అదిరిపోయే వంటకాలతో స్పెషల్ ఆదిత్యం అందినట్టుగాప్రాజెక్ట్ K సెట్స్ లోకి అడుగుపెట్టిన దీపిక పోస్ట్ చేసింది. తాజాగా ప్రభాస్ కల్కి 2898 ఏడీ విషయాలతో పాటుగా దీపిక పదుకొనెపై చేసిన కామెంట్స్ ఇంట్రెస్టింగ్ గా వైరల్ మారాయి.

దీపిక పదుకొణె అందగత్తె మాత్రమే కాదు.. ఆమె అద్భుతమైన నటి. ఇప్పటికే దీపికా పదుకొనె ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది. ఆమె కల్కి 2898 ఏడీ సెట్స్‌లోకి అడుగుపెట్టిన ప్రతిసారీ అక్కడున్న వారందరిలోనూ ఉత్సాహం వస్తుంది. దీపిక అంత యాక్టీవ్ పర్సన్. ఆమె అంటే తనకు ఎప్పటికీ అభిమానమేనని, ఆమెతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకునేవాణ్ణి. అది ఇప్పటికి కల్కి 2898 ఏడీ తో సాధ్యపడింది అంటూ ప్రభాస్ దీపికపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ప్రభాస్-దీపిక జంటగా కమల్ హాసన్ విలన్ గా అమితాబ్, దిశా పటాని లాంటి క్రేజీ నటులు భాగమైన కల్కి 2898 ఏడీ చిత్రం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఈ చిత్రం జనవరి 2024 న వస్తుందా.. లేదంటే సమ్మర్ లో వస్తుందో అనేది ఇంకా కన్ఫ్యూజన్ లో ఉన్న మేటర్.

Viral: Prabhas comments on Deepika:

Prabhas On Kalki 2898 - AD Co-Star Deepika Padukone

Tags:   PRABHAS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ