Advertisementt

చిరు-కళ్యాణ్ కృష్ణ కాంబో గ్లింప్స్ కి డేట్ ఫిక్స్

Thu 03rd Aug 2023 01:34 PM
chiranjeevi  చిరు-కళ్యాణ్ కృష్ణ కాంబో గ్లింప్స్ కి డేట్ ఫిక్స్
Date fix for glimpses of Chiru-Kalyan Krishna combo చిరు-కళ్యాణ్ కృష్ణ కాంబో గ్లింప్స్ కి డేట్ ఫిక్స్
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి భోళా శంకరుడిగా శివ తాండవం చేసేందుకు సమయం ఆసన్నమైంది. మరో వారం రోజుల్లో మెగాస్టార్ ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఆగష్టు 11న భోళా శంకర్ రిలీజ్ కాబోతుంది. అయితే ఈ చిత్రం విడుదల కాగానే మెగాస్టార్ చిరు మరో మూవీతో సెట్స్ మీదకి వెళ్ళబోతున్నారు. సోగ్గాడే చిన్నినాయనా, బంగార్రాజు ఫేమ్ కళ్యాణ్ కృష్ణతో మెగాస్టార్ తదుపరి మూవీ ఉండబోతుంది. ఈ మూవీకి సంబందించిన పూజా కార్యక్రమాలు, రెగ్యులర్ షూట్ అతి త్వరలోనే ఉండబోతుంది.

ఈ చిత్రం నుండి ఫస్ట్ గ్లింప్స్ ఇవ్వడానికి కూడా మేకర్స్ తేదీని రెడీ చేసేస్తున్నారు. ఆగస్టు 22 న మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా చిరు-కళ్యాణ్ కృష్ణ మూవీ నుండి గ్లింప్స్ ఇచ్చేందుకు గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. మెగా ఫాన్స్ కి ఈ గ్లింప్స్ తోనే కళ్యాణ్ కృష్ణ అదిరిపోయే ట్రీట్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది అని తెలుస్తోంది. పైగా ఇది మలయాళ బ్రో డాడీ కి రీమేక్ అనే ప్రచారమూ ఉంది. ఈ చిత్రం కోసమే దర్శకుడు కళ్యాణ్ కృష్ణ హీరోయిన్ గా త్రిష ని సంపాదించే పనిలో పడ్డాడు.

Date fix for glimpses of Chiru-Kalyan Krishna combo:

Chiranjeevi - Kalyan Krishna project glimpse on Aug 22

Tags:   CHIRANJEEVI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ