అటు నితిన్ తో శ్రీలీల డాన్స్ నెంబర్ విడుదలైంది. ఇటు రామ్ తో శ్రీలీల చేసిన సాంగ్ రిలీజ్ అయ్యింది.. మరోపక్క వైష్ణవ తేజ్ తో కలిసి నటిస్తున్న ఆదికేశవ హడావిడి మొదలు కాబోతుంది. పోనీ యంగ్ హీరోలతో సరిపెడుతుందా అంటే స్టార్ హీరోలనీ వదలడం లేదు. పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ అంటుంది. మహెష్ తో గుంటూరు కారం చేస్తుంది. ఇలా ఎటు చూసినా శ్రీలీలే కనబడుతుంది. అందుకే నెటిజెన్స్ కూడా ఏంటమ్మా నీ లీల అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు,.
రామ్ తో జోడి కడుతున్న స్కంద నుండి సాంగ్ రిలీజ్ అయ్యింది. నిజంగా ఈపాటలో శ్రీలీల గ్లామర్ తో డాన్స్ అదరగొట్టేసింది. ఆ డాన్స్ లోని స్టయిల్, ఆమె అందం, అదరగొట్టేసే స్టెప్పులతో శ్రీలీలనే చూడబుద్దయ్యింది. అలాగని రామ్ ని తక్కువ చెయ్యలేం. రామ్ కూడా తన లుక్స్ తో, స్టైలిష్ స్టెప్స్ తో స్టేజ్ ని ఉర్రుతలూగించాడు. ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టుగా స్కందపై ఇప్పుడు అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. బోయపాటి ఖచ్చితంగా రామ్ కి హిట్ ఇవ్వడం ఖాయం.
శ్రీలీల-రామ్ అందమైన స్టెప్స్, ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ, థమన్ మ్యూజిక్ అన్ని ఈ పాటకి హైలెట్ గా నిలిచాయి. ఈ క్రేజీ మూవీ అప్ డేట్స్ తోనే శ్రీలీల గత వారం రోజులుగా ట్విట్టర్ లో ట్రెండ్ అవుతూ వస్తుంది.