థాంక్యూ, కస్టడీ చిత్రాల రిజల్ట్ తో డిస్పాయింట్ అయిన నాగ చైతన్య ఈసారి గ్యాప్ తీసుకుని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ చందు మొండేటితో చేతులు కలిపాడు. గీత ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మాణ సారథ్యంలో నాగ చైతన్య-చందు మొండేటి మూవీ మొదలు కాబోతుంది. ప్రస్తుతం స్టోరీ డిస్కర్షన్స్ లో చైతూ-చందూ బిజీగా వున్నారు. కార్తికేయ 2 తర్వాత చందూ చైతూతో చెయ్యబోయే మూవీపై అందరిలో మంచి అంచనాలున్నాయి. ఈ చిత్రం శ్రీకాకుళం నేపథ్యంలో చేపల వేట నేపథ్యంలో తెరకెక్కబోతుంది. నాగ చైతన్య ఫిషర్ మ్యాన్ గా కనిపించబోతున్నట్లుగా టాక్ ఉంది.
అయితే కస్టడీలో కాస్త మాస్ లుక్స్ లో కనిపించిన నాగ చైతన్య చందు మొండేటి సినిమా కోసం సూపర్ గా మేకోవర్ అయ్యాడు. చైతు సైడ్ లుక్స్ చూస్తే అబ్బా ఏం మేకోవర్ రా బాబు అంటారు. గెడ్డంతో స్పెట్స్ పెట్టుకుని చైతు స్టైలిష్ గా కనిపంచినా ఇది ఫిషర్ మ్యాన్ కోసం చైతు ఇలాంటి లుక్ లోకి ఛేంజ్ అయ్యాడని తెలుస్తోంది. ప్రస్తుతం వైజాగ్ నుండి నాగ చైతన్య, చందు మొండేటి బన్నీ వాసులు శ్రీకాకుళంలోని కళింగ పట్నానికి బయలుదేరి వెళ్లారు.
కళింగ పట్నం బీచ్ లోనే చైతు-మొండేటిల చిత్రం ఎక్కువ భాగం షూటింగ్ జరుపుకోనుంది. ప్రస్తుతం చైతు న్యూ మేకోవర్ లుక్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ఈ చిత్రంతో నాగ చైతన్య హిట్ పక్కా కొడతాడని అక్కినేని అభిమానులు బోలెడంత నమ్మకంతో ఉన్నారు.