పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ ల కలయికలో తెరకెక్కిన BRO మూవీ థియేటర్స్ లో కిందా మీదా పడుతుంది. మొదటి మూడు రోజులు వీకెండ్ కాబట్టి కలెక్షన్స్ పర్వాలేదనిపించినా.. ప్రస్తుతం BRO కలెక్షన్స్ లెక్కలు వీక్ గా కనిపిస్తున్నాయి. మరోపక్క పొలిటికల్ వార్ BRO పై పడింది. అంబటి రాంబాబు BRO సినిమాపై పదే పదే వ్యాఖ్యలు చెయ్యడం.. దానికి నటులు, నిర్మాత కూడా బదులివ్వడం లాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ లు వినిపిస్తూనే ఉన్నాయి. సో సో టాక్ తో థియేటర్స్ లో రన్ అవుతున్న BRO మూవీకి మరో వారం కాలిసొచ్చినా.. ఫలితం శూన్యమనేలా ఉంది.
అదలా ఉంటే పవన్ కళ్యాణ్ BRO ఓటిటీ డేట్ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ సినిమా అంటే దాని డిమాండ్ ఎలా ఉంటుందో తెలుసు. అందుకే BRO ని నెట్ ఫ్లిక్స్ వారు భారీ డీల్ కి చేజిక్కించుకున్నారు. జులై 28 న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రాన్ని ఆగష్టు 28 న స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అంటే ఓటిటీ ఆడియన్స్ కి BRO మూవీ ఆగష్టు 28 నుండి అందుబాటులోకి వచ్చేస్తుంది.
పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి థియేటర్స్ సంగతెలా ఉన్నా ఓటిటిలో మాత్రం ఎగబడి చూడడం గ్యారెంటీ. అందుకే BRO ఓటిటి డేట్ గురించి ఫ్యామిలీ ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వారికిష్టమైన స్ట్రీమింగ్ కబురు అందింది.