Advertisementt

మెగా చిన్న కోడలికి అరుదైన వ్యాధి?

Sun 02nd Jul 2023 10:43 AM
lavanya tripathi,mega daughter in law,rare disease  మెగా చిన్న కోడలికి అరుదైన వ్యాధి?
Lavanya Tripathi Suffering With Rare Disease మెగా చిన్న కోడలికి అరుదైన వ్యాధి?
Advertisement
Ads by CJ

క్యూట్ అండ్ స్వీట్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి త్వరలోనే మెగా ఫ్యామిలోకి చిన్న కోడలిగా అడుగుపెట్టబోతుంది. హీరో వరుణ్ తేజ్‌ని ప్రేమించి రీసెంట్‌గానే నిశ్చితార్ధం చేసుకుంది. వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల పెళ్లి తేదీ కోసం ఇరు కుటుంబాలు మంచి తేదీని వెతకడమే కాదు.. ఆగస్ట్‌లో ఇద్దరు మెగా హీరోలైన చిరు, వరుణ్ తేజ్ సినిమాలు రిలీజ్ అవుతూ ఉండడంతో.. సెప్టెంబర్ కానీ.. లేదంటే నవంబర్, డిసెంబర్‌లలో కానీ వీరి వివాహం చేయాలని చూస్తున్నారట. అందుకు సంబంధించిన వేదిక కోసం కూడా మెగా ఫ్యామిలీ వేట మొదలు పెట్టినట్లుగా తెలుస్తుంది.

 

అయితే మెగా ఇంటికి కోడలిగా అడుగుపెట్టనున్న లావణ్య త్రిపాఠి అరుదైన వ్యాధితో బాధపడుతుంది అంటూ ఓ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. ఎప్పుడో లావణ్య త్రిపాఠి చెప్పిన ఓ విషయాన్ని ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. అది లావణ్యకి ఏదైనా కొత్త వస్తువుని చూసినా.. కొన్నిరకాల ఆకారాలని చూసినా వెంటనే భయం కలుగుతుందట. ఈ విషయాన్ని లావణ్య త్రిపాఠి రెండేళ్ల క్రితమే చెప్పగా.. ఇప్పుడు ఈ విషయాన్నీ వైరల్ చేస్తూ మెగా చిన్న కోడలు లావణ్యకి అరుదైన వ్యాధి అంటూ పబ్లిసిటీ చేస్తున్నారు.

 

అయితే ఆ భయం నుండి బయటపడడానికి లావణ్య చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తుందట. అయినప్పటికీ.. ఆ భయం నుండి తను బయటపడలేక పోతున్నట్టుగా రెండేళ్ల క్రితం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.

Lavanya Tripathi Suffering With Rare Disease:

Lavanya Tripathi Suffering from Trypophobia

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ