Advertisement

వరలక్ష్మీకి కరోనా పాజిటివ్.. అందరూ మేల్కొండి

Tue 19th Jul 2022 10:22 AM
varalaxmi sarathkumar,nbk107,covid,corona positive,twitter video,actress varalaxmi  వరలక్ష్మీకి కరోనా పాజిటివ్.. అందరూ మేల్కొండి
Varalaxmi Sarathkumar Tested Covid Positive వరలక్ష్మీకి కరోనా పాజిటివ్.. అందరూ మేల్కొండి
Advertisement

టాలెంటెడ్ నటి వరలక్ష్మీ శరత్‌ కుమార్ కరోనాకు గురైంది. ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా తాజాగా ట్విట్టర్ వేదికగా వరలక్ష్మీ తెలియజేసింది. ప్రస్తుతం ఆమె నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘NBK107’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర టీమ్‌లోని పలువురు ఇటీవల కరోనాకి గురయ్యారు. చిత్ర కథానాయకుడు బాలకృష్ణని కూడా కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన కోలుకుని ఆరోగ్యంగానే ఉన్నారు. ఇప్పుడు అదే టీమ్‌కి చెందిన వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా కరోనాకి గురయ్యారు. ప్రస్తుతం ఇంటి పట్టునే ఉండి డాక్టర్ల సలహాతో చికిత్స తీసుకుంటున్నట్లుగా తాజాగా ఆమె చెప్పుకొచ్చారు. 

 

‘‘అందరికీ హాయ్.. నేను కరోనా పాజిటివ్‌కి గురయ్యాను. కోవిడ్ ముప్పు తొలిగిపోయిందని.. అంతా ధీమాగా మాస్క్‌లు ధరించడం మానేశారు. నేను కూడా ఇలాగే అనుకుని.. మాస్క్ ధరించలేదు. ఇప్పుడు పరీక్ష చేయించుకుంటే.. నాకు కరోనా పాజిటివ్ అని తెలిసింది. కాబట్టి.. కరోనా పోయిందని ఎవరూ భావించవద్దు. అది మన మధ్యలోనే ఇంకా తిరుగుతుంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్క్ ధరించండి. అలాగే, ఇటీవల కాలంలో నన్ను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను. అందరూ జాగ్రత్తగా ఉండండి..’’ అని తెలుపుతూ వరలక్ష్మీ శరత్ కుమార్ ట్విట్టర్‌లో ఓ వీడియోని షేర్ చేసింది.

Varalaxmi Sarathkumar Tested Covid Positive:

Corona Positive to Varalaxmi Sarathkumar and She Shared video in Twitter

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement