Advertisementt

అక్టోబర్ 23న ప్రభాస్ అభిమానులకి అదిరిపోయే అప్డేట్ రానుంది..

Sat 17th Oct 2020 11:37 AM
radhe shyam,prabhas,pooja hegde,telugu,radha krishna kumar  అక్టోబర్ 23న ప్రభాస్ అభిమానులకి అదిరిపోయే అప్డేట్ రానుంది..
An update coming from Radheshyam on October 23rd.. అక్టోబర్ 23న ప్రభాస్ అభిమానులకి అదిరిపోయే అప్డేట్ రానుంది..
Advertisement
Ads by CJ

ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23వ తేదీన తన సినిమాల నుండి అప్డేట్లు రాబోతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో మూడు సినిమాలున్నాయి. రాధాక్రిష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాధేశ్యామ్, నాగ్ ఆశ్విన్ తో రూపుదిద్దుకుంటున్న సైంటిఫిక్ మూవీతో పాటు బాలీవుడ్ దర్శకుడి ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కే ఆదిపురుష్.. ఈ మూడు చిత్రాల నుండి రకరకాల అప్డేట్లు ప్రభాస్ పుట్టినరోజున అభిమానులని పలకరించబోతున్నాయి.

ఐతే అప్డేట్లు వస్తున్నాయన్న మాటే గానీ ఏం వస్తుందన్న విషయం ఇంకా వెల్లడి చేయలేదు. తాజాగా రాధేశ్యామ్ చిత్ర బృందం ఈ విషయంలో ఒక అడుగు ముందుకు వేసింది. ప్రభాస్ అభిమానుల కోరిక తీర్చడానికా అన్నట్టు, అక్టోబర్ 23వ తేదీన మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేస్తారట. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్ పేరుతో ఈ మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేస్తారట.

మొత్తానికి ఎంతో కాలంగా ఏదైనా అప్డేట్ రిలీజ్ చేయాలని ఎదురుచూస్తున్న ప్రభాస్ అభిమానులకి మోషన్ పోస్టర్ తో ట్రీట్ ఇస్తున్నారు. యువీ క్రియేషన్స్, గోపీక్రిష్ణ మూవీ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాని రాధాక్రిష్ణ కుమార్ డైరెక్ట్ చేస్తున్నారు.

An update coming from Radheshyam on October 23rd..:

An update coming from Radheshyam on October 23rd..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ