Advertisementt

యాక్షన్ లోకి దిగిన రవితేజ..

Mon 12th Oct 2020 12:31 PM
raviteja,krack,shruti hasan,b madhu,gopichand malineni   యాక్షన్ లోకి దిగిన రవితేజ..
Ravi Teja in Action.. యాక్షన్ లోకి దిగిన రవితేజ..
Advertisement
Ads by CJ

మాస్ మహారాజ రవితేజ క్రాక్ సినిమా షూటింగుని తిరిగి ప్రారంభించిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా నిలిచిపోయిన చిత్రీకరణ పునః ప్రారంభం అయ్యింది. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన క్రాక్ బృందం తాజాగా మేకింగ్ వీడియోతో ముందుకు వచ్చింది. కరోనా కారణంగా అన్ని జాగ్రత్తల నడుమ మళ్ళీ షూటింగ్ ప్రారంభించారు.

సెట్లోకి అడుగు పెట్టే ముందు సానిటైజేషన్ తో పాటు, ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించడం, కరోనా టెస్టులు నిర్వహించడం సహా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. క్రాక్ ఇన్ యాక్షన్ అంటూ చివర్లో రవితేజ చెప్పే డైలాగ్ బాగుంది. స్టేషన్లో ఉన్నప్పుడు ఫోన్ సైలెంట్లో పెట్టుకో.. అనే డైలాగ్ వింటుంటే ఫక్తు మాస్ మసాలా చిత్రమని క్లియర్ గా అర్థం అవుతుంది. 

ఐతే ఈ వీడియోలో హీరోయిన్ శృతి హాసన్ మాత్రం కనిపించడం లేదు. బీ మధు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు.

click here for video

Ravi Teja in Action..:

Ravi Teja in Action..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ