Advertisementt

బొమ్మ బ్లాక్ బస్టర్ టీజర్.. పూరీ అభిమాని కథ.

Fri 02nd Oct 2020 12:26 PM
bomma block buster,nandu,rashmi gautam,raj virat,vijayee bhava  బొమ్మ బ్లాక్ బస్టర్ టీజర్.. పూరీ అభిమాని కథ.
Bomma Blockbuster Teaser released.. బొమ్మ బ్లాక్ బస్టర్ టీజర్.. పూరీ అభిమాని కథ.
Advertisement
Ads by CJ

యాక్టర్ నందు తనని తాను రీ ఇన్వెంట్ చేసుకుంటూ చేసిన చిత్రం బొమ్మ బ్లాక్ బస్టర్. పోస్టర్ రిలీజ్ చేసినప్పటి నుండి ఈ సినిమాపై కొద్ది పాటి ఆసక్తి అందరిలో కలిగింది. యాంకర్ రష్మీ హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమా టీజర్ నేడే రిలీజైంది. పోతురాజు పాత్రలో నందూ విజయ్ క్రిష్ణ, పూరీ జగన్నాథ్ అభిమానిగా కనిపిస్తున్నాడు. పోకిరి సినిమా తర్వాత ఆ అభిమానం పిచ్చిగా మారిందంటూ చూపించారు.

సినిమాలో నాటకాలు వేస్తున్నట్టు కనిపించిన పోతురాజు, పూరీ జగన్నాథ్ డైలాగులని రాగం తీస్తూ చెప్పడం ఫన్నీగా ఉంది. హీరో పాత్ర ఎలా ఉంటుందో కొన్ని కొన్ని సీన్లు, డైలాగుల ద్వారా చూపించిన దర్శకుడు, హీరోయిన్ ని మాత్రం గొడవలంటే ఇష్టపడే అమ్మాయిగా మాత్రమే చూపించాడు. వారిద్దరి మధ్య ప్రేమ ఎలా ఉంటుందన్నది పెద్దగా చూపించలేనందున ఈ సినిమా ఊర్లో గాలికి తిరిగే పోతురాజు కథగా తెలుస్తుంది.

విజయీభవ ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు. రాజ్ విరాట్ దర్శకత్వం వహించారు. పేరులోనే బ్లాక్ బస్టర్ అని పెట్టుకున్న ఈ చిత్రం నిజంగా బ్లాక్ బస్టర్ గా నిలిచి, నందూ కెరీర్ ని స్ఫీడ్ అప్ చేస్తుందేమో చూడాలి.

Click here for Teaser

Bomma Blockbuster Teaser released..:

Bomma Blockbuster Teaser released..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ