Advertisementt

గుర్తుందా శీతాకాలం.. తమన్నాతో పాటు మరో భామ..?

Wed 30th Sep 2020 08:32 AM
gurthunda seethakalam,tamannah,satyadev,nagashekar,  గుర్తుందా శీతాకాలం.. తమన్నాతో పాటు మరో భామ..?
Another heroine in Tamannas Gurthunda Seethakalam? గుర్తుందా శీతాకాలం.. తమన్నాతో పాటు మరో భామ..?
Advertisement
Ads by CJ

పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన జ్యోతిలక్ష్మీ సినిమాలో హీరోగా కనిపించిన సత్యదేవ్, బ్లఫ్ మాస్టర్ సినిమాతో పూర్తిస్థాయి హీరోగా మారాడు. ఆ తర్వాత అతడు హీరోగా వచ్చిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య ఓటీటీలో రిలీజై ప్రేక్షకుల నుండి మంచి స్పందన దక్కించుకుంది. కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సత్యదేవ్ నటన సినిమాకి హైలైట్ గా నిలిచింది.

ఈ సినిమా అనంతరం సత్యదేవ్, గుర్తుందా శీతాకాలం అనే సినిమా స్టార్ట్ చేసాడు. కన్నడ చిత్రమైన లవ్ మాక్ టైల్ సినిమాకి తెలుగు రీమేక్ గా రూపొందుతుంది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నా నటిస్తుంది. ఐతే ఈ సినిమాలో తమన్నాతో పాటు మరో హీరోయిన్ కూడా ఉందట. ఆ పాత్ర చాలా కీలకంగా సినిమాలో మలుపులకి కారణం అవుతుందట.

ప్రస్తుతం ఆ పాత్ర కోసం మరో హీరోయిన్ ని వెతుకుతున్నారట. ప్రియా భవాని శంకర్ ని ఆ పాత్రలో తీసుకోవాలని చూస్తున్నారట. మరి తమన్నా హీరోయిన్ గా కనిపిస్తున్న సినిమాలో కనిపించే మరో హీరోయిన్ ఎవరో చూడాలి. నాగశేఖర్ మూవీ బ్యానర్లో నాగశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

Another heroine in Tamannas Gurthunda Seethakalam?:

Another heroine in Tamannas Gurthunda Seethakalam?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ