Advertisementt

వి చిత్రానికి టాప్ లేపారు.. నిశ్శబ్దం సినిమాకి సైలెంట్ అయిపోయారు.

Tue 29th Sep 2020 08:36 AM
nissabdam,anushka shetty,konavenkat,r madhavan  వి చిత్రానికి టాప్ లేపారు.. నిశ్శబ్దం సినిమాకి సైలెంట్ అయిపోయారు.
Is Nissabdam maintaining low profile..? వి చిత్రానికి టాప్ లేపారు.. నిశ్శబ్దం సినిమాకి సైలెంట్ అయిపోయారు.
Advertisement
Ads by CJ

అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన నిశ్శబ్దం ఓటీటీ ద్వారా రిలీజ్ కి సిద్ధమైంది. థియేటర్లలో విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు భావించినప్పటికీ అవెప్పుడు తెరుచుకుంటాయో క్లారిటీ లేనందున ఇక చేసేదేమీ లేక ఓటీటీలో వస్తున్నారు. నిశ్శబ్దం ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. అక్టోబర్ 2వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉండనుంది. ఐతే సినిమా రిలీజ్ అవడానికి పెద్దగా సమయం లేదు.

మరి ఇలాంటి టైమ్ లో కూడా చిత్ర బృందం ఎలాంటి ప్రమోషన్లలో కనిపించడం లేదు. అటు పక్క అమెజాన్ కూడా అంతగా ప్రమోట్ చేస్తున్నట్టు కనిపించడం లేదు. బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న అనుష్క నటిస్తున్న నిశ్శబ్దం సినిమాకి ప్రమోషన్ లేకపోవడం కొంత ఆశ్చర్యం కలిగించే విషయమే. తెలుగు, తమిళ, మళయాల భాషల్లో విడుదల అవుతున్న ఈ సినిమాని సరిగ్గా  జనాల్లోకి తీసుకెళ్తున్నారా అనే సందేహం నెలకొంది.

నాని నటించిన వి చిత్రానికి అటు చిత్రబృందంతో పాటు అమెజాన్ కూడా ప్రమోషన్ గట్టిగా చేసింది. కానీ నిశ్శబ్దం విషయంలో మాత్రం సైలెంట్ గా ఉంటున్నారు. మరి వి ఫలితం కారణంగానే ఇలా చేస్తున్నారా లేదా లో ప్రొఫైల్ లో మెయింటైన్ చేయడమే బెటర్ అనుకుంటున్నారా వారికే తెలియాలి. 

Is Nissabdam maintaining low profile..?:

Is Nissabdam maintaining low profile..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ