Advertisementt

పాకిస్తాన్ టెర్రరిస్టుగా సమంత..?

Sat 26th Sep 2020 07:51 AM
samantha,family man,manoj bajpay,raj and dk  పాకిస్తాన్ టెర్రరిస్టుగా సమంత..?
Samantha played as Terrorist..? పాకిస్తాన్ టెర్రరిస్టుగా సమంత..?
Advertisement
Ads by CJ

తెలుగులో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత, ఓటీటీలోకి అడుగు పెట్టింది. ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులని పలకరించబోతుంది. మనోజ్ బాజ్ పాయ్ ప్రధాన పాత్రలో కనిపిస్తున్న ఈ వెబ్ సిరీస్ మొదటి సీజన్ విజయవంతమైంది. ప్రస్తుతం సీజన్ 2 షూటింగ్ పూర్తయ్యింది. ఐతే ఈ సీజన్లో సమంత పాత్రపై లేటెస్ట్ అప్డేట్ బయటకి వచ్చింది. 

ఈ సీజన్లో సమంత నెగెటివ్ రోల్ కనిపించనుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఐతే తాజా సమాచారం ప్రకారం సమంత పాకిస్తాన్ టెర్రరిస్ట్ గా కనిపించనుందట. ఈ విషయమై నిజానిజాలు తెలియనప్పటికీ సమంత టెర్రరిస్ట్ గా కనిపించనుందని సోషల్ మీడియా కోడై కూస్తుంది. స్టార్ హీరోయిన్ అయిన సమంత నెగెటివ్ రోల్ లో కనిపించడమే విచిత్రం అనుకుంటే టెర్రరిస్టుగా కనిపిస్తుందనడం ఇంకా విచిత్రం.

హీరోయిన్ గా ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించిన సమంత, ఈ సిరీస్ లో నెగెటివ్ పాత్రలో మెప్పిస్తుందో లేదో చూడాలి. బాలీవుడ్ నిర్మాతలైన రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ ని నిర్మించారు. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ అవనుంది.

Samantha played as Terrorist..?:

Samantha played as Terrorist..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ