Advertisementt

మహేశ్‌ను పక్కనెట్టి.. చెర్రీ పైనే ఆశలు!

Mon 21st Sep 2020 10:33 PM
ram charan,vamsi paidipally,mahesh babu,vamsi hopes,evadu,maharshi  మహేశ్‌ను పక్కనెట్టి.. చెర్రీ పైనే ఆశలు!
Vamsi Paidipally Huge Hopes on Ram charan! మహేశ్‌ను పక్కనెట్టి.. చెర్రీ పైనే ఆశలు!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన వంశీ పైడిపల్లి గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఆయన తీసిన సినిమాలను తీస్తే వంశీ రేంజ్ ఏంటో అర్థమవుతుంది. అయితే ఆయన సినిమాలు హిట్టయినప్పటికీ హీరోలు మాత్రం ఎందుకో రావట్లేదు. ‘ఎవడు’, ‘మహర్షి’ లాంటి మూవీలు సూపర్ డూపర్ హిట్టయ్యాయి. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేశ్‌తో మరో సినిమా తీయాలని వంశీ అనుకున్నాడు. అయితే.. మహేశ్‌కు ఆయన చెప్పిన కథతో పక్కనెట్టారని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు స్క్రిప్ట్ మార్చినప్పటికీ ప్రిన్స్ నిజంగా స్క్రిప్టే కారణమా..? లేకుంటే ఇంకేమైనా కారణాలున్నాయా..? అనేది మాత్రం తెలియరాలేదు. ఇద్దరిలో ఏ ఒక్కరూ స్పందించి దీనిపై క్లారిటీ ఇచ్చుకోలేదు.

ఆ తర్వాత ఒకట్రెండు సార్లు మహేశ్‌తో వెబ్‌ సిరీస్ అంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఆ తర్వాత ఆ ఊసే లేదు. ఈ క్రమంలో వెబ్ సైట్స్ మాత్రం వీరిద్దరి ఏదేదో జరిగిందని.. అందుకనే మహేశ్‌ను పూర్తిగా పక్కనెట్టి మరో బడా హీరోను వెతుకుతున్నట్లు తెలిసింది. అయితే టాలీవుడ్ నడుస్తున్న టాక్ ప్రకారం మహేశ్ కోసం అనుకున్న కథ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు వినిపించగా ఆయన ఓకే అన్నాడని తెలియవచ్చింది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత వంశీతో చెర్రీ సినిమా ఉంటుందని టాక్. చెర్రీ పైనే ఆశలన్నీ పెట్టుకున్నాడట. వాస్తవానికి RRR తర్వాత చెర్రీ ఏ కథకూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో పక్కాగా చెర్రీ ఛాన్స్ ఇస్తాడని వంశీ ఆశలు పెట్టుకున్నాడట. 

ఇదివరకే చెర్రీకి ‘ఎవడు’ మూవీ హిట్టిచ్చాడు. అప్పట్లోనే ఈ సినిమాకు సీక్వెల్ అనుకున్నప్పటికీ అది వర్కవుట్ కాలేదు. ప్రస్తుతం మహేశ్ కోసం అనుకున్న కథ మాత్రమే కాకుండా ఇంకా ఒకట్రెండు స్క్రిప్ట్స్‌ను రెడీ చేసుకునే పనిలో ఉన్నాడట. ఇందులో ఏ కథ చెర్రీకి నచ్చినా పట్టాలెక్కించడానికి వంశీ సిద్ధవుతున్నాడట. చెర్రీ అయినా హ్యాండివ్వకుండా వంశీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో వేచి చూడాలి మరి.

Vamsi Paidipally Huge Hopes on Ram charan!:

Vamsi Paidipally Huge Hopes on Ram charan!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ