తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ ఇప్పటి వరకూ 1,2,3 షోలను విజయవంతంగా నడిపించేసింది. కరోనా కష్టకాలం తర్వాత బిగ్ బాస్-04కు ‘మా’ టీవీ యాజమాన్యం ప్లాన్ చేస్తున్నట్లు తెలియవచ్చింది. ఇందులో భాగంగా షోకు హోస్ట్‌గా ఎవర్ని తీసుకోవాలి..? కంటెస్టెంట్స్‌గా ఎవరెవర్ని తీసుకోవాలి అనే విషయాలపై సమాలోచనలు చేస్తున్నారు. కాగా మొదట అటు బుల్లితెర.. ఇటు వెండితెరపై రాణిస్తూ యమా బిజీగా గడుపుతున్న యాంకర్ కమ్ నటి అనసూయను సంప్రదించారట. ఇందుకు ఆ భామ స్పందిస్తూ అబ్బే.. నేను బిగ్ బాస్ షోకు వెళ్లడమా నో వే అని తేల్చిచెప్పేసిందట. అసలు తానెందుకు ఇలా చెప్పింది అనే దానికి సుధీర్ఘంగా వివరణ కూడా ఇచ్చుకుందట.
మేడమ్.. మిమ్మల్ని బిగ్ బాస్-04కు సెలక్ట్ చేయబోతున్నాం అని ‘మా’ నుంచి కొందరు షో నిర్వాహకులు కాల్ చేసి మాట్లాడరట. అయితే కుదరదని సింగిల్ మాటలోనే సింపుల్‌గా చెప్పేసిందట. అంతేకాదు భారీగానే రెమ్యునరేషన్ ఉంటుంది మేడం.. కాదనకండి.. మీరు కచ్చితంగా ఎస్ చెబుతారనే అనుకుంటున్నామని మరోసారి అడిగారట. ఈసారి ఏకంగా తాను అన్నేసి రోజులు హౌస్‌లో ఉండలేను.. మరీముఖ్యంగా ఫ్యామిలీని మెంబర్స్‌ను వదిలి రావాలంటే తన వల్ల కాదని చెప్పిందట. వాస్తవానికి ఈ భామకు ఇప్పుడు చేతినిండా షోలు ఉన్నాయ్. మళ్లీ కొత్తగా ఒకట్రెండు షోలు కూడా ఈ హాట్ భామ యాంకరింగ్ కోసం వేచి ఉన్నాయ్. కరోనా తర్వాత అన్నీ అనుకున్నట్లు జరిగితే అన్ని షోలు ప్రారంభవుతాయ్. దీనికోసమే అను వేచి చూస్తోంది.
ఇవన్నీ అటుంచితే.. కంటెస్టెంట్స్‌గా మొదట వెళ్లకున్నా వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ కూడా ఉంటుంది. ఫైనల్‌గా ఇలా అయినా సరే అనును షోకు రప్పించాలని నిర్వాహకులు భావిస్తున్నారట. అప్పటికీ అను రాకపోతే ఏ యాంకర్ రష్మికో.. లేకుంటే లేడీ యాంకర్స్‌లో ఎవరికైనా చాన్స్ ఇవ్వాలని భావిస్తున్నారట. ఎందుకో బిగ్ బాస్ షో అంటే మునుపటిలా క్రేజ్ లేదు. ఆ కిక్కు చాలా వరకూ తగ్గిపోయింది. అందుకే ఈ షోకు టక్కున ఎవరూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ఆసక్తి చూపట్లేదట. మరీ భారీగా రెమ్యునరేషన్‌కు కూడా అనసూయ అస్సలు ఓకే చెప్పలేదంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మరి ఈసారి ఎవరెవర్ని కంటెస్టెంట్స్‌గా తీసుకుంటారో..? హోస్ట్‌గా ఎవర్ని ఫైనల్ చేస్తారో తెలియాల్సి ఉంది.